Realme Narzo 50A Prime: రూ.12 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ మొబైల్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్.
రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ నార్జో లైనప్‌లో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు.
రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా... 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఫ్లాష్ బ్లాక్, ఫ్లాష్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, రియల్‌మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 192.5 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు మోనోక్రోమ్ లెన్స్, మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్ ఉండనుంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5,జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉండనున్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరో మీటర్, గైరోస్కోప్ కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?