అన్వేషించండి

100W ఫాస్ట్ చార్జింగ్‌తో రియల్‌మీ కొత్త ఫోన్ - ఫీచర్లు కూడా లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ రియల్‌మీ జీటీ నియో 4ను మనదేశంలో లాంచ్ చేయనుంది.

రియల్‌మీ జీటీ నియో 4 స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో బయటకు వచ్చాయి. రెడ్‌మీ కే60కి పోటీగా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో 1.5కే ప్లస్ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ప్రముఖ చాట్ స్టేషన్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ మనదేశంలో, చైనాలో లాంచ్ కానుంది. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ నియో 3కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3టీ పని చేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 194.5 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం

వీడియోలు

Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Breaking News: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Embed widget