అన్వేషించండి

Realme C30s: రూ.8 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - భారీ బ్యాటరీతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ సీ30ఎస్ స్మార్ట్ ఫోన్.

రియల్‌మీ సీ30ఎస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.

రియల్‌మీ సీ30ఎస్ ధర
ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది.

స్ట్రైప్ బ్లాక్, స్ట్రైప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు దీని సేల్ ప్రారంభం కానుంది. సాధారణ సభ్యులకు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

రియల్‌మీ సీ30ఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ 9863ఏ ప్రాసెసర్‌పై రియల్‌మీ సీ30ఎస్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా ద్వారా హెచ్‌డీ వీడియోలను 30 ఎఫ్‌పీఎస్ ఫ్రేమ్ రేట్‌లో షూట్ చేయవచ్చు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ4.2 కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Digital Terminal (@digitalterminal)

టాప్ హెడ్ లైన్స్

Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sachin -Sooryavanshi Critique: 15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు
15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు, వన్డే ఫార్మాట్ మార్పులకు పిలుపు
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Embed widget