Realme 9i 5G: రూ.14 వేలలోపే రియల్‌మీ 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త 5జీ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 9ఐ 5జీ.
రియల్‌మీ 9ఐ 5జీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.
రియల్‌మీ 9ఐ 5జీ ధర
ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మొదటి వేరియంట్ రూ.13,999కు, రెండో వేరియంట్ రూ.14,999కు లభించనుంది. ఆగస్టు 24వ తేదీన దీని సేల్ ప్రారంభం కానుంది. మెటాలికా గోల్డ్, రాకింగ్ బ్లాక్, సోల్‌ఫుల్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ 9ఐ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉంది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. వీటితో పాటు మ్యాగ్నటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్, ప్రాక్సిమిటీ, యాక్సెలరేషన్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W క్విక్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.
రియల్‌మీ మరో చవకైన 5జీ ఫోన్‌పై ఎప్పట్నుంచో పనిచేస్తుంది. దీని ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. రూ.15 వేల రేంజ్‌లో 5జీ ఫోన్లు ఇప్పటికే వచ్చాయి కాబట్టి రూ.10 వేలలో ఈ కొత్త ఫోన్ ధర ఉండవచ్చు. దీంతోపాటు మరో రెండు, మూడు కొత్త విభాగాల్లోకి రియల్‌మీ ఎంటర్ కానుందని వార్తలు కంపెనీ సీఈవో మాధవ్ తెలిపారు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!