Poco M6 Pro 5G: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - పోకో ఎం6 ప్రో 5జీ వచ్చేసింది - 12 జీబీ వరకు ర్యామ్ కూడా!
పోకో కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే పోకో ఎం6 ప్రో 5జీ.
పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పోకో ఎం6 ప్రో 5జీ పని చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. పోకో ఫోన్లలో ఇదే అత్యంత భారీ డిస్‌ప్లే అని కంపెనీ అంటోంది.
పోకో ఎం6 ప్రో 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో పోకో ఎం6 ప్రో 5జీ లాంచ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు లభించనుంది.
పోకో ఎం6 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంను అందించారు. రెండు మేజర్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లను ఈ ఫోన్ అందుకోనుంది. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా లభించనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఐపీ53 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా పోకో ఎం6 ప్రో 5జీలో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు.
The 5G Disrupter #PocoM6Pro5G comes with Powerful Snapdragon 4 Gen 2 Processor & Premium glass Design making it a great choice for experiencing an unmatched mobile experience.💫
— POCO India (@IndiaPOCO) August 5, 2023
Starting from ₹9,999 on flipkart.
Check out the link👉🏻https://t.co/M1KBOtTUwb#IntoThe5GSpeedverse pic.twitter.com/PF8HhaDVg5
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial