Poco F4 5G: పోకో ట్రాక్‌లోకి వస్తుందా - ఎఫ్4 5జీ వచ్చేస్తుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే పోకో ఎఫ్4 5జీ.
పోకో తన కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే పోకో ఎఫ్5 5జీ. దీంతోపాటు ఈ ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఇమేజెస్ కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. పోకో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోకో ఎఫ్4 5జీని అధికారికంగా ప్రకటించింది.
ఈ ట్వీట్‌లో ‘ఎవ్రీథింగ్ యూ నీడ్’ అని పేర్కొంది. స్మార్ట్ ఫోన్ పేరు గురించి తప్ప స్పెసిఫికేషన్ల గురించి కానీ, ధర గురించి కానీ పోకో ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతోపాటు ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు ట్వీట్ చేసింది.
ఈ ఇమేజెస్‌లో స్మార్ట్ ఫోన్ గ్రీన్ కలర్‌లో చూడవచ్చు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఫోన్‌కు కుడివైపున ఉన్నాయి. ఇటీవలే పోకో ఎఫ్4 జీటీ మనదేశంలో లాంచ్ అయింది. చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ కే40 గేమింగ్ ఎడిషన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ చేశారు. రెడ్‌మీ కే40ఎస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
నిజానికి పోకో అనే బ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం 2018లో వచ్చిన పోకో ఎఫ్1. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. మిడ్ రేంజ్ ధరలో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తర్వాత చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఈ ఫార్ములా ట్రై చేసినా ఈ స్థాయిలో సక్సెస్ కాలేదు. పోకో ఎఫ్1 కారణంగా పోకో ప్రత్యేకమైన బ్రాండ్‌గా మారింది. కానీ పోకో తర్వాత లాంచ్ చేసిన ఫోన్లేవీ ఆ రేంజ్‌ను అందుకోలేదు. ఈ ఫోన్ అయినా ఎలా ఉంటుందో తెలియాలంటే లాంచ్ అయ్యే దాకా వెయిట్ చేయాలి.
పోకో ఎఫ్4 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
రెడ్‌మీ కే40ఎస్ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ లాంచ్ అయితే.. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!