Oppo A38: 50 మెగాపిక్సెల్ కెమెరాతో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో - ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ38.
ఒప్పో ఏ38 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ సూపర్ వూక్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఒప్పో ఏ38 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను మనదేశంలో రూ.12,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి జరగనుంది.
ఒప్పో ఏ38 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 720 నిట్స్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ38 రన్ కానుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వైఫై 5, బ్లూటూత్ వీ5.3, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.
Get ready to elevate your mobile experience! Launching OPPO A38, at just Rs.12,999
— OPPO India (@OPPOIndia) September 8, 2023
Experience the power of 4GB RAM + 128GB ROM, capture brilliance with the 50MP AI Camera, and recharge in a flash with 33W SUPERVOOC TM. 📱💫 #OPPOA38
Know More: https://t.co/uUpx01y9OB pic.twitter.com/KhynSxJNq1
Sound meets style. Experience the future of audio and technology with OPPO Enco Air3 Pro and #OPPOReno10Series #ThePortraitExpert pic.twitter.com/e5vcUyNGbr
— OPPO India (@OPPOIndia) August 11, 2023
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial