అన్వేషించండి

Oneplus V Fold: వావ్ అనిపించే ఫీచర్లతో రానున్న వన్‌ప్లస్ వీ ఫోల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. అదే వన్‌ప్లస్ వీ ఫోల్డ్.

వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ వన్‌ప్లస్ వీ ఫోల్డ్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ షీట్‌ను షేర్ చేశారు. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో (జులై నుంచి సెప్టెంబర్ మధ్య) తన ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని బ్రాండ్ ఇప్పటికే ధృవీకరించింది. ఈ ఫోన్ ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

పెద్ద డిస్‌ప్లేతో..
లీకుల ప్రకారం వన్‌ప్లస్ వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ బయటవైపు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.3 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. లోపలి వైపు 7.8 అంగుళాల అమోఎల్ఈడీ ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్‌నే. లీక్ అయిన రెండర్ల ప్రకారం స్క్రీన్ చుట్టూ సన్నని బెజెల్స్‌ను చూడవచ్చు.

వన్‌ప్లస్ వీ ఫోల్డ్ కెమెరా
వన్‌ప్లస్ వీ ఫోల్డ్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం  48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో యూనిట్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన ఆప్టికల్ జూమ్ వివరాలు తెలియరాలేదు. సెల్ఫీల కోసం, ప్రధాన డిస్‌ప్లే వైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 20 మెగాపిక్సెల్ అండర్ స్క్రీన్ కెమెరాను కూడా అందించారు.

మెమరీ, ప్రాసెసర్ వివరాలు
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఇది 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుందని వార్తలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ పరంగా చూసుకుంటే వన్‌ప్లస్ వీ ఫోల్డ్‌లో ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది.

మరోవైపు వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి ఇది ప్రో వెర్షన్‌గా రానుంది. వన్‌ప్లస్ ఏస్ 2లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే కంపెనీ అందించింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 5జీ ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ ఏస్ 2 పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోలో మాత్రం అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయి.

ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ ఛాట్ స్టేషన్ వీబో పోస్ట్ ప్రకారం వన్‌ప్లస్ 2 ప్రోలో ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్ అందించనున్నారు. వన్‌ప్లస్ ఏస్ 2లో అందించిన ప్రాసెసర్ కంటే ఇది వేగవంతమైన ప్రాసెసర్. 

ఇంతకుముందు అమెజాన్ అనుకోకుండా ఐకూ నియో 7 ప్రో 5జీ ధరను కూడా లీక్ చేసింది. మోటొరోలా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మోటొరోలా రేజర్ 40,  మోటొరోలా రేజర్ 40 అల్ట్రాలను జూలై 3వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే అధికారిక లాంచ్‌కు ఒక వారం ముందు మోటొరోలా రేజర్ 40 ధర అనుకోకుండా అమెజాన్‌లో లీక్ అయింది.

Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Capital: అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
Telangana Politics BJP: వ్యక్తిగత దాడులు.. పొలిటికల్ అస్త్రాలు- బండి భగీరథ్ కేసు చుట్టూ మారుతున్న తెలంగాణ రాజకీయం!
వ్యక్తిగత దాడులు.. పొలిటికల్ అస్త్రాలు- బండి భగీరథ్ కేసు చుట్టూ మారుతున్న తెలంగాణ రాజకీయం!
Nandigram Bypoll: బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
Make In Andhra Pradesh: ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Capital: అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
Telangana Politics BJP: వ్యక్తిగత దాడులు.. పొలిటికల్ అస్త్రాలు- బండి భగీరథ్ కేసు చుట్టూ మారుతున్న తెలంగాణ రాజకీయం!
వ్యక్తిగత దాడులు.. పొలిటికల్ అస్త్రాలు- బండి భగీరథ్ కేసు చుట్టూ మారుతున్న తెలంగాణ రాజకీయం!
Nandigram Bypoll: బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
Make In Andhra Pradesh: ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
Petrol-Diesel Buying New Rule:చమురు సంక్షోభం నివారణకు చర్యలు! 5 వేల రూపాయలకు మించి పెట్రోల్ కొనలేరు! డీజిల్ కోటా 200 లీటర్లే!
చమురు సంక్షోభం నివారణకు చర్యలు! 5 వేల రూపాయలకు మించి పెట్రోల్ కొనలేరు! డీజిల్ కోటా 200 లీటర్లే!
Robot Buddha: రోబో సన్యాసి ప్రబోధాలు, ఇకపై మత బోధనలు చేసేది కూడా AI రోబోలేనా!
రోబో సన్యాసి ప్రబోధాలు, ఇకపై మత బోధనలు చేసేది కూడా AI రోబోలేనా!
iBOMMA : iBOMMA ఓపెన్ చేస్తున్నారా - ఇది మీ కోసమే!
iBOMMA ఓపెన్ చేస్తున్నారా - ఇది మీ కోసమే!
Immunity Boosting Tips : 30 రోజుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా? రోగాలు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిందే
30 రోజుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా? రోగాలు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిందే
Embed widget