News
News
X

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ఏస్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది.

FOLLOW US: 

వన్‌ప్లస్ ఏస్ ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను కంపెనీ అందించింది. అలాగే ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

వన్‌ప్లస్ ఏస్ ప్రో ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లుగా (సుమారు రూ.41,200) ఉంది. ఇక 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లుగానూ (సుమారు రూ.44,800), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 యువాన్లుగానూ (సుమారు రూ.50,700) నిర్ణయించారు.

వన్‌ప్లస్ ఏస్ ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ ఏస్ ప్రో పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. 10 బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది.

16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. 4జీ ఎల్టీఈ, 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 150W సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 19 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.

మనదేశంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 10టీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా వన్‌ప్లస్ ఏస్ ప్రో లాంచ్ అయింది. వన్‌ప్లస్ 10టీలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గానూ, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గానూ నిర్ణయించారు. జేడ్ గ్రీన్, మూన్ స్టోన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 10 Aug 2022 04:15 PM (IST) Tags: OnePlus New Phone OnePlus Ace Pro Price OnePlus Ace Pro OnePlus Ace Pro Features OnePlus Ace Pro Launched

సంబంధిత కథనాలు

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

Google Pixel 7 Pro: కెమెరాల్లో దీనికి యాపిల్ మాత్రమే పోటీ - గూగుల్ పిక్సెల్ 7 ప్రో వచ్చేసింది!

Google Pixel 7 Pro: కెమెరాల్లో దీనికి యాపిల్ మాత్రమే పోటీ - గూగుల్ పిక్సెల్ 7 ప్రో వచ్చేసింది!

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!