అన్వేషించండి

OnePlus Ace 2 Pro: సూపర్ ఫీచర్లతో వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో - 24 జీబీ ర్యామ్, 1024 జీబీ స్టోరేజ్ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో.

OnePlus Ace 2 Pro: వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో బుధవారం లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. 24 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 6.74 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఏకంగా 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో సపోర్ట్ చేయనుంది.

వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో ధర
ఈ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బేస్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా (సుమారు రూ.34,600) నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,399 యువాన్లుగానూ (సుమారు రూ.39,200), 24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.46,100) ఉంది. అరోరా గ్రీన్, టైటానియం యాష్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మరి మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే తయారీలో రెయిన్ వాటర్ టచ్ టెక్నాలజీని ఉపయోగించామని, వర్షంలో కూడా దీన్ని ఉపయోగించడానిక ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్ అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా అందించారు. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 210 గ్రాములుగా ఉంది.

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget