OnePlus 9 Pro Offer: ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై ఏకంగా రూ.16 వేల వరకు తగ్గింపు - ఇది నెవ్వర్ బిఫోర్ ఆఫర్!
వన్‌ప్లస్ గతేడాది లాంచ్ చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 9 ప్రోపై కంపెనీ భారీ ఆఫర్ అందించింది. ఈ ఫోన్‌పై రూ.16 వేల వరకు తగ్గింపు అందించారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ గతేడాది వన్‌ప్లస్ 9 ప్రో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌పై ఇప్పుడు భారీ ఆఫర్ అందించారు. ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా వన్‌ప్లస్ 9 ప్రోను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 9 ప్రో ధర, ఆఫర్
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.64,999గా ఉంది. ఇప్పుడు ఆ ఫోన్‌పై రూ.5,000 తగ్గించారు. దీంతోపాటు రూ.5,800 కూపన్, ఎస్‌బీఐ కార్డు ఫుల్ స్వైప్, క్రెడిట్ కార్డు ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.15,800 తగ్గింపు అన్నమాట. దీంతో ఈ ఫోన్ ధర రూ.49,199కి తగ్గిపోనుంది.
వన్‌ప్లస్ 9 ప్రో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర లాంచ్ అయినప్పుడు రూ.69,999 కాగా... పైన పేర్కొన్న ఆఫర్లన్నీ దీనిపై కూడా ఉన్నాయి. దీంతో ఈ వేరియంట్‌ను రూ.54,199కి కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 9 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 9 ప్రో పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వన్‌ప్లస్ 9 ప్రోలో అందించారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!