News
News
X

OnePlus 10T Sale Date: 16 జీబీ ర్యామ్ వన్‌ప్లస్ ఫోన్ సేల్ తేదీ వచ్చేసింది - ఆరోజు నుంచే!

వన్‌ప్లస్ 10టీలో 16 జీబీ ర్యామ్ మోడల్ సేల్ ఆగస్టు 16వ తేదీ నుంచి జరగనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

FOLLOW US: 

వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో 16 జీబీ ర్యామ్ వేరియంట్ సేల్ అమెజాన్‌లో ఆగస్టు 16వ తేదీ నుంచి జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.

వన్‌ప్లస్ 10టీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గానూ, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గానూ ఉంది. జేడ్ గ్రీన్, మూన్ స్టోన్ బ్లాక్ రంగుల్లో వన్‌ప్లస్ 10టీని కొనుగోలు చేయవచ్చు. వీటిలో 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ వేరియంట్ల సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. 16 జీబీ ర్యామ్ వేరియంట్ ఆగస్టు 16వ తేదీ నుంచి జరగనుంది.

వన్‌ప్లస్ 10టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 10టీ పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (ఎల్టీపీవో) టెక్నాలజీతో ఈ డిస్‌ప్లేను రూపొందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 10 బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. 4జీ ఎల్టీఈ, 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా వన్‌ప్లస్ 10టీలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా కాగా, 150W సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ వైర్డ్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 160W సూపర్‌వూక్ పవర్ అడాప్టర్‌ను ఫోన్‌తో పాటు బాక్స్‌లో అందించారు. ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 19 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ అంటోంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 12 Aug 2022 02:36 PM (IST) Tags: OnePlus New Phone OnePlus 10T OnePlus 10T Features OnePlus 10T Price in India OnePlus 10T Launched OnePlus 10T Price OnePlus 10T 16GB RAM Amazon Sale OnePlus 10T 16GB RAM

సంబంధిత కథనాలు

5G Services in India: జియో Vs ఎయిర్‌టెల్ - 5G సేవల ఆరంభానికి జోరందుకున్న పోటీ, ఏయే నగరాల్లో ఎవరు ముందు?

5G Services in India: జియో Vs ఎయిర్‌టెల్ - 5G సేవల ఆరంభానికి జోరందుకున్న పోటీ, ఏయే నగరాల్లో ఎవరు ముందు?

WhatsApp sticker:మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్ మార్చుకోవచ్చు, ఫ్రెండ్స్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు!

WhatsApp sticker:మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్ మార్చుకోవచ్చు, ఫ్రెండ్స్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు!

ఈ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - కొత్త ఫీచర్లు ఆన్ ది వే!

ఈ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - కొత్త ఫీచర్లు ఆన్ ది వే!

ఐకూ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 5జీ ప్రాసెసర్, సూపర్ ఫీచర్లతో!

ఐకూ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 5జీ ప్రాసెసర్, సూపర్ ఫీచర్లతో!

Redmi Note 12 Series: 210W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ఈ సంవత్సరమే లాంచ్!

Redmi Note 12 Series: 210W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ఈ సంవత్సరమే లాంచ్!

టాప్ స్టోరీస్

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !