News
News
X

Nothing Phone 1 Sale: మొదటి సారి సేల్‌కు వెళ్లనున్న నథింగ్ ఫోన్ 1 - డిజైనే పెద్ద ప్లస్!

నథింగ్ ఫోన్ 1 ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది.

FOLLOW US: 

నథింగ్ ఫోన్ 1 సేల్ మనదేశంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నేడు (గురువారం) సాయంత్రం ఏడు గంటలకు ఈ ఫోన్ సేల్ మొదలవనుంది. లండన్ బేస్డ్ కంపెనీ నథింగ్ లాంచ్ చేసిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. విభిన్నమైన డిజైన్‌ను ఈ ఫోన్‌లో అందించారు. వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ డిజైన్, ఎల్ఈడీ స్ట్రిప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 1 పనిచేయనుంది.

నథింగ్ ఫోన్ 1 ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.32,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999గానూ ఉంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌కు రానుంది. మొదటి సేల్‌లో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది.

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై నథింగ్ ఫోన్ 1 పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్ల గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 1 పనిచేయనుంది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు నథింగ్ ప్రకటించింది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 21 Jul 2022 06:44 PM (IST) Tags: Nothing Nothing Phone 1 Nothing Phone 1 Sale Nothing Phone 1 Features Nothing Phone 1 specifications Nothing Phone 1 Price in India Nothing Phone 1 Flipkart Sale

సంబంధిత కథనాలు

ఆండ్రాయిడ్ 12, 50 మెగాపిక్సెల్ కెమెరాలతో మోటొరోలా కొత్త ఫోన్ - ధర ఎంతంటే?

ఆండ్రాయిడ్ 12, 50 మెగాపిక్సెల్ కెమెరాలతో మోటొరోలా కొత్త ఫోన్ - ధర ఎంతంటే?

iQoo Neo 7: ఐకూ కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ - సూపర్ కెమెరాలతో!

iQoo Neo 7: ఐకూ కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ - సూపర్ కెమెరాలతో!

Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!

Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!

Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?

Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?

50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!