Motorola Razr 3: మోటొరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తుంది - ధర వింటే షాక్ కొట్టడం ఖాయం!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.
మోటొరోలా తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే మోటొరోలా రేజర్ 3. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ డిజైన్‌తో మోటొరోలా రేజర్ సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేజర్ సిరీస్‌లో కొత్త ఫోన్ కూడా అదే డిజైన్‌తో రానుంది.
జూన్ నెలాఖరులో లేదా జులై మొదట్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఇప్పటికే లీకయ్యాయి. దీన్ని బట్టి ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో ఉండనుంది.
డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన దాని ప్రకారం మోటొరోలా రేజర్ 3లో 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. మోటొరోలా రేజర్ 5జీ కూడా ఇదే బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం ఒకేలా ఉన్నా మోటొరోలా రేజర్ 3 ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించనుంది. ఎందుకంటే ఇందులో మెరుగైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది కాబట్టి.
అయితే ఇటీవలే లాంచ్ అయిన దీని పోటీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 4లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దాంతో పోలిస్తే మోటొరోలా రేజర్ 3 బ్యాటరీ సామర్థ్యం తక్కువే. దీనికి సంబంధించిన ఇతర కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో వంటి స్పెసిఫికేషన్లతో ఈ డిస్‌ప్లే ఉండనుంది. దీంతోపాటు మరో సెకండరీ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ ఓమ్నీ విజన్ సెన్సార్‌ను అందించనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ ధర యూరోప్‌లో 1,149 యూరోలుగా (సుమారు రూ.94,300) ఉండనుందని తెలుస్తోంది. క్వార్ట్జ్ బ్లాక్, ట్రాంక్విల్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మనదేశంలో కూడా ఈ ఫోన్ రూ.లక్ష రేంజ్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram