అన్వేషించండి

ఆండ్రాయిడ్ 12తో మోటొరోలా కొత్త ఫోన్ - వెనకవైపు సూపర్ కెమెరా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే మోటో ఎస్30 ప్రో.

మోటో ఎస్30 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.

మోటో ఎస్30 ప్రో ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.26,000) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ(సుమారు రూ.29,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్లుగానూ (సుమారు రూ.34,200) ఉంది. క్లియర్ ఫ్రాస్ట్ వైట్, ఇంక్ రైమ్ బ్లాక్, మూన్‌లిట్ నైట్, స్ప్రింగ్ రివర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో మోటో ఎస్30 ప్రో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

మోటో ఎస్30 ప్రో స్పెసిఫికేషన్లు
మోటో ఎస్30 ప్రోలో 6.55 అంగుళాల 53 డిగ్రీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గానూ ఉంది. డీసీ డిమ్మింగ్, డీసీఐ-పీ3 కలర్ గాముట్ సపోర్ట్, హెచ్‌డీఆర్10+, ఎస్‌జీఎస్-సర్టిఫైడ్ లో బ్లూ లైట్ మోడ్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఐ ఆపరేటింగ్ సిస్టంపై మోటో ఎస్30 ప్రో పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ50ఏ ప్రైమరీ సెన్సార్ కాగా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4270 ఎంఏహెచ్ కాగా, 68W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

మోటొరోలా ఈ ఈవెంట్‌లోనే 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న మోటొరోలా ఎక్స్30 ప్రోను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో వెనకవైపు 200 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండటం విశేషం. ముందువైపు కూడా 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Hum Safar Weekly Express Timings: శ్రీకాకుళం రోడ్ -తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం- టైమింగ్స్ ఇవే!
శ్రీకాకుళం రోడ్ -తిరుపతి హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం- టైమింగ్స్ ఇవే!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Embed widget