By: ABP Desam | Updated at : 12 Oct 2022 11:51 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మోటో జీ72 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.
మోటో జీ72 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. కంపెనీ లేటెస్ట్ జీ-సిరీస్‌లో రీసెంట్‌గా లాంచ్ అయిన ఫోన్ ఇదే. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.6 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు. ఇదే ధరలో ఉన్న షావోమీ, రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లతో మోటో జీ72 పోటీ పడనుంది.
మోటో జీ72 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. మీటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు కార్డ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
మోటో జీ72 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 576 హెర్ట్జ్‌గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, డెప్త్ కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 30W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై మోటో జీ72 పనిచేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు, యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్, అండర్ డిస్‌ప్లే ఫింగర్ సెన్సార్లు కూడా ఇందులో అందించారు.దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 166 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
iPhone 11 Offer: రూ.17 వేలలోపే ఐఫోన్ 11 - ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే
Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్