అన్వేషించండి

Moto E32s Sale: రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా - అయితే ఈ ఫోన్ మీకోసమే - సేల్ కూడా ప్రారంభం!

మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో ఈ32ఎస్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీని ధర రూ.9,299 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మోటో ఈ32ఎస్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మోటో ఈ32కి కొన్ని మార్పులు చేసి మోటో ఈ32ఎస్‌గా లాంచ్ చేశారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంలు ఇందులో ఉన్నాయి.

మోటో ఈ32ఎస్ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,299గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్‌ల్లో కూడా మోటో ఈ32ఎస్ అందుబాటులో ఉంది.

మోటో ఈ32ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ కూడా ఉంది. 3 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనవచ్చు. 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

మోటో ఈ32ఎస్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Upcoming Smartphones in 2026: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
Chiranjeevi Venkatesh Song: చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
Embed widget