News
News
X

Moto E22s Sale: మోటో కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.10 వేలలోపే!

మోటో ఈ22ఎస్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

FOLLOW US: 

మోటో ఈ22ఎస్ స్మార్ట్ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. మోటో ఈ-సిరీస్‌లో ఇటీవలే లాంచ్ అయిన మొబైల్ ఇది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై మోటో ఈ22ఎస్ పని చేయనుంది.

మోటో ఈ22ఎస్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

మోటో ఈ22ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై మోటో ఈ22ఎస్ పని చేయనుంది. ఐపీ52 వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో దీన్ని మోటొరోలా రూపొందించింది.

News Reels

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by Motorola India (@motorolain)

Published at : 22 Oct 2022 06:19 PM (IST) Tags: Moto E22s Moto E22s Price in India Moto E22s Specifications Moto E22s Features Moto E22s Flipkart Sale Moto E22s Sale

సంబంధిత కథనాలు

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Vivo X90 Pro Plus: ఈ ఫోన్‌కు మార్కెట్లో పోటీనే లేదు - వన్‌ప్లస్ 11 సిరీస్ రావాల్సిందే!

Vivo X90 Pro Plus: ఈ ఫోన్‌కు మార్కెట్లో పోటీనే లేదు - వన్‌ప్లస్ 11 సిరీస్ రావాల్సిందే!

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

Vivo X90: వావ్ అనిపించే కెమెరాలో వివో ఎక్స్90 - వన్‌ప్లస్ 10, షావోమీ 12లకు గట్టిపోటీ!

Vivo X90: వావ్ అనిపించే కెమెరాలో వివో ఎక్స్90 - వన్‌ప్లస్ 10, షావోమీ 12లకు గట్టిపోటీ!

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!