JioPhone Next Offer: రూ.4 వేలలోపే స్మార్ట్ ఫోన్ - రూ.14 వేల లాభాలు - బంపర్ ఆఫర్!
భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో మనదేశంలో లాంచ్ చేసిన జియోఫోన్ నెక్స్ట్‌పై భారీ ఆఫర్‌ను అందించింది.
జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ గతేడాది మనదేశంలో లాంచ్ అయింది. ఎంట్రీ లెవల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను జియో తీసుకువచ్చింది. అయితే వినియోగదారులు ఆశించిన స్థాయిలో ఈ ఫోన్ ధర లేకపోవడంతో దీని ధరను కంపెనీ మరింత తగ్గించింది.
జియో ఫోన్ నెక్స్ట్ ధర
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.6,499గా ఉంది. ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.4,490 ధరకే లిస్ట్ అయింది. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.450 తగ్గింపు లభించనుంది. అంటే రూ.4,050కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. కానీ ఈ ఫోన్ ద్వారా రూ.14,000 విలువైన లాభాలు లభించనున్నాయి.
జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్‌గా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఇందులో అందించారు. డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram