By: ABP Desam | Updated at : 24 May 2023 04:16 PM (IST)
ఐకూ నియో 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ( Image Source : iQoo )
iQoo Neo 8 Launched: ఐకూ నియో 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఐకూ నియో 8 స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఐకూ నియో 8 ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ34, ఏ54 మొబైల్స్‌తో పోటీ పడనుంది.
ఐకూ నియో 8 ధర
ఈ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,499 యువాన్లుగా (సుమారు రూ.29,300) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లు (సుమారు రూ.32,800) కాగా, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,099 యువాన్లుగా (సుమారు రూ.36,400) ఉంది. నైట్ రాక్, మ్యాచ్ పాయింట్, సర్ఫ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐకూ నియో 8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.78 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ 2160 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతో పాటు 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 194.6 గ్రాములుగా ఉంది.
ఐకూ నియో 6 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో భారీగా తగ్గించారు. ఏకంగా రూ.5,000 వరకు కంపెనీ తగ్గించడం విశేషం. ఈ ఫోన్ గతేడాది మేలో మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఐకూ నియో 6 పనిచేయనుంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.29,999గా ఉంది. ఇప్పుడు దాన్ని రూ.24,999కి తగ్గించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.33,999 కాగా, ప్రస్తుతం రూ.28,999కు తగ్గింది. బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!
WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!
Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్
Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!
WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?