అన్వేషించండి

iQoo 11 Pro: మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - వివో ఎక్స్90, షావోమీ 13 సిరీస్‌తో పోటీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఐకూ 11 ప్రో.

ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ఐకూ 11 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇటీవలే లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. ఇటీవలే లాంచ్ అయిన వివో ఎక్స్90 సిరీస్‌కు, త్వరలో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్‌కు ఇవి పోటీ ఇవ్వనున్నాయి.

ఐకూ 11 ప్రో ధర
ఐకూ 11 ప్రోలో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.59,200), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగానూ (సుమారు రూ.65,000) ఉంది.

టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా (సుమారు రూ.70,000) నిర్ణయించారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ స్పెషల్ ఎడిషన్, లెజెండరీ ఎడిషన్, ట్రాక్ వెర్షన్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానుంది.

ఐకూ 11 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల శాంసంగ్ ఈ6 అమోఎల్ఈడీ 2కే డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

512 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, బైదు, జీపీఎస్, గ్లోనాస్ , గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. 3డీ అల్ట్రా సోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా, 200W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 50W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 213 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget