iQoo 10 Pro: బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో కొత్త ఫోన్లు - త్వరలో లాంచ్ చేయనున్న ఐకూ!
ఐకూ 10 సిరీస్ ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయి. గతంలో లాంచ్ అయిన ఐకూ 9 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఇవి రానున్నాయి.
ఐకూ ఇటీవలే తన 9 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఐకూ 10 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడానికి కూడా కంపెనీ సిద్ధం అవుతోందని తెలుస్తోంది. ఐకూ 10, ఐకూ 10 ప్రో స్మార్ట్ ఫోన్లు వచ్చే నెలలో లాంచ్ కానున్నాయి.
డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఐకూ 10, ఐకూ 10 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో జులై నెలలో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ ఫోన్లు మనదేశంలో కూడా చాలా పాపులర్ కాబట్టి ఆ తర్వాత ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో ఎంట్రీ ఇచ్చిన మొదటి ఫోన్లలో ఐకూ 9 ప్రో ఒకటి. జనవరిలోనే ఈ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టింది.
ఐకూ 10 సిరీస్‌లో ఎస్ఈ మోడల్ ఉంటుందో లేదో తెలియరాలేదు. అయితే ఐకూ 9 సిరీస్‌లో ఈ ఎస్ఈ మోడల్‌ను అందించారు. కానీ ఈ ఐకూ 9 ఎస్ఈ కేవలం మనదేశంలో మాత్రమే లాంచ్ అయింది. ఐకూ 10 గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు.
అయితే ఐకూ 10 ప్రో గురించి కొన్ని వివరాలు లీకయ్యాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో 2కే అమోఎల్ఈడీ ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
ఐకూ నియో 6 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా నిర్ణయించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 80W ఫ్లాష్ చార్జ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6.62 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!