iPhone 16: ఐఫోన్ 16 ఫీచర్లు లీక్ - ఈసారి మరింత పెద్ద డిస్‌ప్లేలతో!
iPhone 16 Series: ఐఫోన్ 16 ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి ఐఫోన్ 16 సిరీస్‌లో 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది.
iPhone 16 Series: సెప్టెంబర్ 11వ తేదీన యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఐఫోన్ 15 ధర రూ.79,990 నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు ఈ సిరీస్‌లో ఏదో ఒక ప్రత్యేకతను ఆశించారు. కానీ ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్తగా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 16లో ఆ లోటును పూరించగలదని వార్తలు వస్తున్నాయి. నిజానికి వినియోగదారులు ఐఫోన్ 15లో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటును ఆశించారు. కానీ కంపెనీ ఇందులో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును అందించారు. రూ.80 వేల ధర వద్ద ఇది నిరాశే అని చెప్పవచ్చు.
ఐఫోన్ 16 వివరాలు
ఇండియా టుడే నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 16 బేస్ మోడల్‌లలో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ బేస్ మోడల్‌లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను మాత్రమే అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లేను, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే యాపిల్ అందించనుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల్లో 6.1, 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది.
యాపిల్ ప్రారంభంలో ఐఫోన్ 15 ప్రో లైనప్‌తో సాలిడ్ స్టేట్ బటన్‌ను పరిచయం చేయాలని భావించింది. ఇది ఐఫోన్ ఎస్ఈ సిరీస్ హోమ్ బటన్‌లో కనిపించే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ మాదిరిగా ఉంటుంది. ఐఫోన్ 15 ప్రోలో కంపెనీ దీన్ని అందించనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లో కంపెనీ సాలిడ్ స్టేట్ బటన్‌ను అందించే అవకాశం ఉందని ప్రసిద్ధ యాపిల్ విశ్లేషకుడు మింగ్ చి కుయో తెలిపారు.
కొత్త చిప్‌సెట్ కూడా...
2024లో లాంచ్ కానున్న ఐఫోన్ 16 సిరీస్ బేస్ మోడల్స్‌లో A17 చిప్‌సెట్‌ను, ప్రో మోడల్‌లలో కొత్త ఏ18 ప్రో చిప్‌సెట్‌ను కంపెనీ మీకు అందించే అవకాశం ఉంది. యాపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో "టెట్రా ప్రిజం" టెలిఫోటో కెమెరాను అందించగలదని నివేదికలలో తెలిపారు. ఇది ఆప్టికల్ జూమ్‌ను 3x నుంచి 5xకి పెంచుతుంది. ఇది కాకుండా హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్‌లోని సాంకేతిక విశ్లేషకుడు జెఫ్ పు, ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుందని, ఇది తక్కువ కాంతిలో మెరుగైన ఫోటోగ్రఫీకి సహాయపడుతుందని అంచనా వేశారు.
మరోవైపు ఐఫోన్ 15 సిరీస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది. వీటి ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను అందించారు. ఐఫోన్ 14లో ప్రో మోడల్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial