iPhone 15: ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఇలా కొంటే రూ. ఆరు వేలు తగ్గింపు!
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి.

iPhone 15 Series Pre orders: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రీ ఆర్డర్‌లు ఈరోజు నుంచి భారతదేశంలో ప్రారంభమయ్యాయి. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ మనదేశంలో సెప్టెంబర్ 12వ తేదీన లాంచ్ అయింది. అలాగే దాని డెలివరీలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే, క్యాష్‌బ్యాక్ ఆఫర్, దానిపై లభించే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకోవడం మంచిది. కంపెనీ అధికారిక సైట్లో ఈ ఫోన్లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
మీరు ఐఫోన్ 15 సిరీస్‌లో ఏ ఫోన్ అయినా కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సిరీస్‌లోని ఐఫోన్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి యాపిల్ బీకేసీ ముంబై, యాపిల్ సాకేత్ ఢిల్లీ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర
256 జీబీ: రూ. 1,59,900
512 జీబీ: రూ. 1,79,900
1 టీబీ: రూ. 1,99,990
ఐఫోన్ 15 ప్రో ధర
128 జీబీ: రూ. 1,34,990
256 జీబీ: రూ. 1,44,990
512 జీబీ: రూ. 1,64,990
1 టీబీ: రూ. 1,84,990
ఐఫోన్ 15 ప్లస్ ధర
128 జీబీ: రూ. 89,990
256 జీబీ: రూ. 99,990
512 జీబీ: రూ. 1,19,900
ఐఫోన్ 15 ధర
128 జీబీ: రూ. 79,990
256 జీబీ: రూ. 89,990
512 జీబీ: రూ. 1,09,900
ఐఫోన్ 15 సిరీస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులను కొనుగోలు చేస్తే... ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌లపై రూ. 6,000 క్యాష్‌బ్యాక్ పొందుతారు. అలాగే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌పై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అలాగే ఐఫోన్ 14, 14 ప్లస్ కొనుగోలు చేస్తే రూ. 4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఐఫోన్ 13పై రూ. 3,000, ఐఫోన్ ఎస్ఈపై రూ. 2,000 తగ్గింపు ఉంటుంది.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఫోన్ 15 మొబైల్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా అందించారు. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
ఈ రెండు ఫోన్లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను యాపిల్ అందించింది.
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

