iPhone 15: యాపిల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఐఫోన్ 15 లాంచ్ ఆలస్యం!
ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ కొద్దిగా ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. యాపిల్ సాధారణంగా సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్లను లాంచ్ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం అవుతుంది. కోవిడ్ కారణంగా 2020లో మాత్రం ఐఫోన్ 12 సిరీస్ లాంచ్ కాస్త ఆలస్యం అయింది. ఈ సంవత్సరం ఐఫోన్ 15 విషయంలో కూడా ఇదే విధంగా ఆలస్యం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 15 సిరీస్ అక్టోబర్‌లో లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సప్లై చెయిన్ విషయంలో సమస్యల కారణంగా ఈ లాంచ్ లేట్ అవుతుందని తెలుస్తోంది. ఒకవేళ లాంచ్ అయినా ప్రారంభంలో తక్కువ ధరకే అందుబాటులో ఉండనుందని సమాచారం.
ఒకవేళ సెప్టెంబర్‌లోనే లాంచ్ అయినప్పటికీ షార్ట్ సప్లై సమస్యను ఈ సిరీస్ ఫోన్లు ఎదుర్కోనున్నాయి. అంటే సేల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా డిస్‌ప్లేకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రో మోడల్స్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లే కోసం యాపిల్ డిస్‌ప్లే సప్లయర్స్ కొత్త తరహా ఉత్పత్తి ప్రక్రియను ఫాలో అవుతున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో కొంచెం పెద్ద డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
యాపిల్ ప్రో మోడల్స్‌కు ఎల్జీ డిస్‌ప్లేలు అందిస్తుంది. తయారీలో వచ్చే సమస్యల కారణంగా డిస్‌ప్లేల షార్టేజ్ ఏర్పడింది. దీని కారణంగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఎక్కువ ఎఫెక్ట్ కానుందని తెలుస్తోంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అనుకున్న సమయానికి లాంచ్ అవుతాయా లేకపోతే ఆలస్యం అవుతాయా అన్నది వేచి చూడాలి.
మరోవైపు యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ధరలను భారీగా నిర్ణయించనుందని సమాచారం. యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు తెలుపుతున్న దాని ప్రకారం ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ వేరియంట్‌లు 14 సిరీస్ కంటే చాలా ఎక్కువ ధరతో రానున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర 1,099 డాలర్ల కంటే ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో పెద్ద బ్యాటరీ, డిస్‌ప్లేలు మాత్రమే కాకుండా పెరిస్కోప్ లెన్స్ కూడా అందించనుండటం విశేషం.
ఈ రెండు ప్రో మోడల్స్‌లోనూ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను యాపిల్ అందించను:ది. ఐఫోన్ 15 ప్రోలో టెలిఫోటో లెన్స్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6x వరకు ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ లెన్స్ ఉండనున్నాయని జెఫ్ పు తన నివేదికలో పేర్కొన్నారు. 3x జూమ్ సపోర్ట్ మాత్రమే లభించే 14 ప్రో మోడల్స్‌తో కంపేర్ చేస్తే ఇది ఐఫోన్ 15 సిరీస్‌కు చాలా పెద్ద అప్‌డేట్ అవుతుంది.
91 మొబైల్స్ నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో 14 సిరీస్ కంటే 18 శాతం ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీని అందించనున్నారు. ఐఫోన్ 15 బ్యాటరీ ఐఫోన్ 14 కంటే 18 శాతం ఎక్కువగా బ్యాకప్‌ను అందించనుందని సమాచారం. ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్, డైనమిక్ ఐలాండ్ సపోర్ట్ కూడా ఉండనున్నాయి.
Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial