iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - ఈసారి ఐఫోన్ 14 ప్లస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ తన ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 13వ తేదీన లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 13వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఒక టిప్‌స్టర్ తెలిపారు. ఇందులో నాలుగు మోడల్స్ ఉండనున్నాయి. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో ఈ సంవత్సరం వచ్చిన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కంటే కొంచెం పెద్ద కెమెరా ఉండనుంది. ఈ నాలుగు ఫోన్లలో రెండిట్లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ప్రో మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. ప్రో మోడల్స్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి.
సెప్టెంబర్ 13వ తేదీన లాంచ్ ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, దానికి ప్రో వెర్షన్ కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లు ఉండనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోల్లో స్క్రీన్ సైజ్ ఒకేలా ఉండనుంది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లలో పెద్ద స్క్రీన్లు ఉండనున్నాయి. వీటి సైజ్ ప్రకారం చూస్తే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రోల్లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉండనున్నాయి.
ఈ టిప్‌స్టర్ పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి చూస్తే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్ ఉండనుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరాలను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రముఖ యాపిల్ టిప్‌స్టర్ మింగ్ చి కువో ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ విషయాన్ని తెలిపారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram