ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?
ఐఫోన్ 14 ప్రోలో నెట్‌వర్క్ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.
టెక్ దిగ్గజం యాపిల్ తన ఫార్ అవుట్ ఈవెంట్‌లో కొత్త యాపిల్ వాచ్ 8, కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో 2 ఇయర్‌బడ్‌లతో పాటు సరికొత్త ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. Apple ఈ సంవత్సరం iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max మొబైల్స్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు అమెరికాలోని వెరిజోన్ నెట్‌వర్క్ ఉపయోగిస్తున్న కొంతమంది iPhone 14 ప్రో కస్టమర్‌లు 5జీకి సంబంధించిన సమస్యలను రిపోర్ట్ చేస్తున్నారు.
“ఇది కొత్త ఐఫోన్‌లతో ఏదో సమస్య అని నేను అనుకుంటున్నాను. ఐఫోన్ 14 ప్రో వాడుతున్న నాకు ఇంట్లో ఒకటి, రెండు బార్‌ల సిగ్నల్ ఉంటుంది. కానీ నా సోదరుడు iPhone 13 ఉపయోగిస్తున్నాడు. అతని సిగ్నల్ పూర్తిగా 4 బార్‌లు ఉన్నాయి. అతని ఐఫోన్ 13, నా ఐఫోన్ 14 ప్రో కంటే మెరుగైన స్పీడ్‌ను పొందుతుంది. ఈ సమస్యను త్వరలో వచ్చే iOS అప్‌డేట్ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాము, ”అని ఒక రెడిట్ యూజర్ పేర్కొన్నారు.
వెరిజోన్ నెట్‌వర్క్‌లోని ఐఫోన్ 14 ప్రోలో 5G స్పీడ్ చాలా తక్కువగా ఉందని మరొక యూజర్ కూడా పేర్కొన్నారు. సమస్య వెరిజోన్ 5G నెట్‌వర్క్‌లో ఉందా లేక ఐఫోన్ 14 సిరీస్‌లో ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొంతమంది రెడిట్ యూజర్లు తమకు ఈ సమస్య లేదని అంటున్నారు.
అయితే యాపిల్ లేదా వెరిజాన్ ఇంకా ఈ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించలేదు. ఈ రెండు కంపెనీల్లో ఏదో ఒకటి సమస్యను పరిష్కరించే వరకు వినియోగదారులు వేచి చూడక తప్పదు.
యాపిల్ కొన్ని కొత్త iPhone 14 Pro స్మార్ట్ ఫోన్‌ల్లో కెమెరా షేకింగ్ సమస్యల కోసం iOS అప్‌డేట్‌ను విడుదల చేసింది. iPhone 14 Pro, iPhone 14 Pro Max కెమెరాతో ఈ సమస్యను పరిష్కరించడానికి Apple కొత్త iOS 16.0.2 అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్‌లలో ఈ సమస్య ఉన్నట్లు చాలా మంది రిపోర్ట్ చేశారు. iOS 16ని అమలు చేయగల సామర్థ్యం ఉన్న అన్ని iPhoneలకు ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది.
ఐఫోన్ 14 ప్రో డివైస్‌లో వీడియోలను రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని విచిత్రమైన శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తోంది. పాత iPhone నుంచి iPhone 14కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడంలో కూడా సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వినియోగదారులు పాత iPhone నుండి కొత్త iPhone 14కి డేటాను బదిలీ చేస్తున్నప్పుడు, కొత్త డివైస్ స్క్రీన్ పూర్తిగా నల్లగా మారుతుందని తెలుపుతున్నారు. హార్డ్ రీసెట్‌ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ సమస్య సాల్వ్ అవుతోంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?