అన్వేషించండి

Poco X7 Pro: హైపర్ఓఎస్ 2.0తో ఇండియాలో మొదటి ఫోన్ - పోకో ఎక్స్7 ప్రో లాంచ్‌కు రెడీ!

Poco X7 Pro Launch Date: పోకో తన కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. పోకో ఎక్స్7 ప్రో పేరుతో రానున్న ఈ ఫోన్ హైపర్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంతో మార్కెట్లోకి రానుంది.

Xiaomi HyperOS 2.0: షావోమీ ప్రస్తుతం కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్ ప్రోపై పని చేస్తోంది. ఇది మిడ్ రేంజ్ మోడల్‌గా మార్కెట్లోకి రానుంది. ఇండియాలో హైపర్‌ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేయనున్న తొలి డివైస్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందిన హైపర్ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్‌తో చైనాలో లాంచ్ అయిన మొదటి ఫోన్ షావోమీ 15. ఈ ఆపరేటింగ్ సిస్టం భారతదేశంలో పోకో ఎక్స్7 ప్రోతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.

పోకో ఎక్స్7 ప్రో ఫీచర్లు లీక్...
ఈ విషయాన్ని స్మార్ట్‌ప్రిక్స్ మొదట వెల్లడించింది. షావోమీ 15... హైపర్ఓఎస్ 2.0తో చైనాలో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 2025 మార్చి నాటికి భారతదేశంలో లాంచ్ కానుందని అంచనా. కానీ పోకో ఎక్స్7 ప్రో... షావోమీ 15 కంటే ముందే భారతదేశంలో లాంచ్ కానుంది. దీనికి ముందు వెర్షన్ పోకో ఎక్స్6 ప్రో జనవరి 2024లో భారతదేశంలో లాంచ్ అయింది. కాబట్టి పోకో ఎక్స్7 ప్రో కూడా అదే సమయంలోనే అంటే 2025 జనవరిలో భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ఆధారంగా పోకో ఎక్స్7 ప్రో... రెడ్‌మీ నోట్ 14 ప్రోకి సంబంధించిన రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.

రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌ని డిసెంబర్‌లో లాంచ్ చేయనున్నట్లు షావోమీ ఇటీవల ప్రకటించింది. కాబట్టి పోకో ఎక్స్7, పోకో ఎక్స్7 ప్రో ఒక నెల తర్వాత భారతదేశానికి వచ్చినా ఆశ్చర్యం లేదు. షావోమీ ఇంతకుముందు ఒకే ఫోన్‌ను వేర్వేరు సబ్‌బ్రాండ్‌ల కింద విడివిడిగా విడుదల చేసింది. కానీ వీటిలో చిన్న తేడాలు ఉంటాయి.

Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!

పోకో ఎక్స్7 ప్రో అనేది రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్ అయితే ఇది 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఫీచర్లు ఉన్న 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరోవైపు కెమెరా గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉండవచ్చు. హార్డ్‌వేర్ పరంగా చూసుకుంటే పోకో ఎక్స్7 ప్రో... స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను పొందుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు భారీ 6,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

హైపర్‌ఓఎస్ 2.0 ముఖ్య ఫీచర్లు
మెరుగైన పనితీరు: హైపర్‌ఓఎస్ 2.0ను ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించారు. ఇది వినియోగదారులకు స్మూత్, ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇది ఆప్టిమైజేషన్ ద్వారా సిస్టమ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

అడ్వాన్స్‌డ్ యూజర్ ఇంటర్‌ఫేస్: హైపర్‌ఓఎస్ 2.0 కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇది నావిగేషన్‌ను సులభతరం చేస్తుంది. డివైస్ లుక్, ఫీల్‌ను కూడా పెంచుతుంది.

బ్యాటరీ మేనేజ్‌మెంట్: ఇది అడ్వాన్స్‌డ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టంను కలిగి ఉంది. ఇది బ్యాటరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చేలా చేస్తుంది.

మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు: యూజర్ ప్రైవసీ, డేటాను రక్షించడానికి, సురక్షితమైన డివైస్‌ను అందించడానికి హైపర్ఓఎస్ 2.0 కొత్త సెక్యూరిటీ అప్‌డేట్లు, ఫీచర్లను తీసుకువస్తుంది.

కస్టమైజేషన్ ఆప్షన్లు: థీమ్స్, ఐకాన్ ప్యాక్స్, విడ్జెట్స్ మొదలైన వాటిని ఫోన్‌కు కావలసిన విధంగా మార్చుకోవడానికి వినియోగదారులను అనుమతించే అనేక కస్టమైజేషన్ ఆప్షన్లతో ఈ ఆపరేటింగ్ సిస్టం వస్తుంది.

Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Embed widget