అన్వేషించండి

HTC Desire 22 Pro: హెచ్‌టీసీ కొత్త ఫోన్ వచ్చేసింది - మెటావర్స్ కంటెంట్ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హెచ్‌టీసీ కొత్త స్మార్ట్ ఫోన్ డిజైర్ 22 ప్రోను లాంచ్ చేసింది.

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. గత స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన ఆరు నెలల తర్వాత హెచ్‌టీసీ కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. అదే హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో. ఇది ఒక మెటావర్స్ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్. ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) డివైస్‌ల్లో 2డీ, 3డీ కంటెంట్‌ను కూడా ఈ డివైస్‌ను ఎంజాయ్ చేయవచ్చు. హెచ్‌టీసీ వైవ్ ఫ్లో వీఆర్ గ్లాస్‌లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 399 యూరోలుగా (సుమారు రూ.38,500) నిర్ణయించారు. యూకేలో దీన్ని ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో అందుబాటులో ఉంది. మనదేశంలో ఈ ఫోన్ అసలు లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.

హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Embed widget