iPhone 17 Pro vs iPhone 16 Pro: కొత్త ఐఫోన్ మోడల్ ఫీచర్స్ లీక్- పాత మోడల్‌తో పోల్చుకుంటే ఉన్న తేడా ఏంటీ ?
iPhone 17 Pro vs iPhone 16 Pro: ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 16 ప్రోతో పోలిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోండి. యాపిల్ త్వరలోనే ఐఫోన్ 17 ప్రోని విడుదల చేయనుంది.

iPhone 17 Pro vs iPhone 16 Pro: Apple ప్రస్తుతం తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ iPhone 17 పై వర్క్ చేస్తోంది. iPhone 17 Air ప్రజల ఆసక్తిని పెంచినప్పటికీ, iPhone 17 Pro కూడా చాలా డిస్కషన్‌లో ఉంది. ఇటీవల వెలువడిన ఒక వీడియో ఈ కొత్త డివైజ్ డిజైన్‌లోని మార్పులను చూపిస్తుంది, ఇది iPhone 16 Pro కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమాచారం అంతా లీక్‌లు, ఊహాగానాలపై ఆధారపడి ఉంది. Apple ఇంకా ఏమీ అధికారికంగా ప్రకటించలేదు.
కెమెరా డిజైన్‌లో మార్పు
Twitter (ఇప్పుడు X) లో టిప్‌స్టర్ Majin Bu పంచుకున్న వీడియోలో iPhone 17 Pro డమ్మీ మోడల్‌ను చూడవచ్చు. అతిపెద్ద మార్పు ఏంటంటే కెమెరా మాడ్యూల్ కొత్త లేఅవుట్. iPhone 16 Pro కెమెరా సెటప్ వెనుక ఎగువ ఎడమ కార్నర్‌లో ఉండగా, iPhone 17 Pro లో ఇది ఇప్పుడు వెనుక వైపున పూర్తి వెడల్పుగా విస్తరించి కనిపిస్తుంది.
ఈ డిజైన్ Google Pixel సిరీస్‌తో సరిపోలుతుంది, కానీ చాలా టెక్ నిపుణులు Apple ఈ కొత్త శైలి ఇంకా అంతగా మెరుగుపడలేదని భావిస్తున్నారు. కెమెరా, ఫ్లాష్, మైక్రోఫోన్, సెన్సార్ మధ్య ఎక్కువ ఖాళీ స్థలం గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. Apple దీనికి ప్రత్యేక కవర్ లేదా దానికి రిలేడెట్ ఏదైనా తీసుకురావచ్చని ఊహిస్తున్నారు.
మిగిలిన డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు
ఇప్పుడున్న సమాచారం ప్రకారం, యాక్షన్ బటన్, వాల్యూమ్ కీలు, పవర్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్ వంటివి వాటి ఇప్పుడు ఫోన్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. స్క్రీన్ సైజు కూడా iPhone 16 Pro లాంటిదే ఉండే అవకాశం ఉంది. అంటే ఈసారి ప్రధాన దృష్టి డిజైన్ కాదు, కెమెరాపై ఉంటుంది.
కెమెరా, బిల్డ్ నాణ్యతలో పెద్ద మెరుగుదల
ఇతర మార్పుల విషయానికొస్తే, Apple మళ్ళీ అల్యూమినియం ఫ్రేమ్‌కు తిరిగి రావచ్చని ఊహలు ఉన్నాయి. iPhone 15 Pro, 16 Pro లో టైటానియం ఫ్రేమ్ ఇవ్వచ్చారు, కానీ iPhone 17 Pro లో అల్యూమినియం ఫ్రేమ్ ఉండే అవకాశం ఉంది, దీనివల్ల ఫోన్ తేలికగా, బహుశా తక్కువ ఖరీదైనదిగా మారవచ్చు.
ఫ్రంట్ కెమెరా గురించి కూడా బిగ్ న్యూస్ వినిపిస్తోంది. iPhone 17 సిరీస్‌లో 24MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు, ఇది ప్రస్తుత 12MP యూనిట్ కంటే రెట్టింపు నాణ్యతను అందిస్తుంది. అదే సమయంలో, iPhone 17 Pro Max లో మూడు వెనుక కెమెరాలు 48MP సెన్సార్‌తో ఉండవచ్చు, ఇందులో ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్, టెట్రాప్రిజమ్ టెలిఫోటో జూమ్ లెన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, కెమెరాలో మెకానికల్ అపెర్చర్ వంటి ప్రో-ఫీచర్లు రావచ్చని ఆశిస్తున్నారు, దీనివల్ల వినియోగదారులు లైట్ కంట్రోల్‌ను కూడా మాన్యువల్‌గా చేయగలరు.
పెర్ఫార్మెన్స్, బ్యాటరీలో ఈ మార్పులు ఉంటాయి
iPhone 17 Proలో Apple కొత్త A19 Pro చిప్‌సెట్ ఉండవచ్చు, ఇది 3nm టెక్నాలజీ ఆధారంగా ఉంటుంది. ఇది A18 Pro కంటే కొంత మెరుగైన పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. అదనంగా, RAM ను 12GB వరకు పెంచవచ్చు, ఇది మల్టీటాస్కింగ్‌ను మరింత సున్నితంగా చేస్తుంది. అయితే, iPhone 17, 17 Air వంటి బేస్ వేరియంట్లలో 8GB RAM మాత్రమే ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ విషయంలో కూడా బెటర్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. iPhone 17 Proలో పెద్ద బ్యాటరీతోపాటు, iPhone 16 సిరీస్‌లో బ్యాటరీ భర్తీని సులభతరం చేసిన అదే రీమూవేబుల్ స్ట్రిప్స్ కూడా ఉండవచ్చు. అయితే, ఛార్జింగ్ వేగంలో ఎలాంటి మార్పు ఉండదు, ఇప్పటికీ గరిష్టంగా 35W వైర్డ్ ఛార్జింగ్ మాత్రమే లభిస్తుంది. Apple ఈ తాజా మోడల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చని తెలుస్తోంది.





















