అన్వేషించండి

Google Pixel 7 Series: ఆండ్రాయిడ్ 13తో మొదటి స్మార్ట్ ఫోన్ - గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే?

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. అక్టోబర్ 6వ తేదీన వీటిని లాంచ్ చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు అక్టోబర్ 6వ తేదీన లాంచ్ కానున్నాయి. దీన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరమే మార్కెట్లోకి వచ్చాయి. వీటితో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ కానుంది.

అక్టోబర్ 6వ తేదీన రాత్రి 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ ఈవెంట్ జరగనుంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో, గూగుల్ పిక్సెల్ వాచ్‌లు ఈ కార్యక్రమంలో లాంచ్ కానున్నాయి. గూగుల్ ల్యాండింగ్ పేజీలో దీని వివరాలను చూడవచ్చు. దీంతోపాటు నెస్ట్ స్మార్ట్ హోం ప్రొడక్ట్స్ కూడా కంపెనీ లాంచ్ చేసింది.

గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలను మొదటిగా గూగుల్ ఐవో సదస్సులో రివీల్ చేశారు. కంపెనీ రెండో తరం టెన్సార్ ప్రాసెసర్లను వీటిలో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఫొటోలు, వీడియోలు, సెక్యూరిటీ, స్పీచ్ రికగ్నిషన్‌లకు ప్రత్యేకమైన ఫీచర్లను ఈ చిప్‌సెట్ అందించనుందని గూగుల్ తెలిపింది. కొన్ని రోజుల క్రితం పిక్సెల్ 7 ప్రో అన్‌బాక్సింగ్ వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని చూడవచ్చు.

ఇక గూగుల్ పిక్సెల్ 6ఏపై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ ఆఫర్ అందించారు. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం రూ.43,999 విలువైన గూగుల్ పిక్సెల్ 6ఏను రూ.27,699కే కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ కూడా తీసేశాక ఈ ధరకు ఫోన్ లభించనుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 6ఏ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను గూగుల్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గూగుల్ పిక్సెల్ 6ఏలో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా గూగుల్ పిక్సెల్ 6ఏ సపోర్ట్ చేయనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget