News
News
X

Google Pixel 7: గూగుల్ పిక్సెల్ 7 ప్రో వీడియో లీక్ - డిజైన్ సూపర్ ఉందిగా!

గూగుల్ పిక్సెల్ 7 ప్రో వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది.

FOLLOW US: 

గూగుల్ పిక్సెల్ 7 ప్రోకు సంబంధించిన వివరాలు మళ్లీ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనికి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అన్‌బాక్స్ అయింది బ్లాక్ కలర్ ఫోన్ కాగా దాని వెనకవైపు జీ లోగోను కూడా చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ రెండిటినీ గూగుల్ ఐవో 2022 సదస్సులో ప్రకటించారు. వీటి డిజైన్ చూడటానికి పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో తరహాలోనే ఉండనుంది.

దీనికి సంబంధించిన వీడియోలో గూగుల్ పిక్సెల్ 7 ప్రో బ్లాక్ కలర్‌లో ఉంది. దీని వెనకవైపు గ్లాస్ డిజైన్‌తో అందించారు. గూగుల్ ఐవో 2022 సదస్సులో కూడా ఇదే డిజైన్‌తో ఈ ఫోన్ టీజ్ చేశారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి టెలిఫొటో సెన్సార్ అయ్యే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 7 వెనకవైపు జీ లోగో చూడవచ్చు. ఫోన్ బూట్ అయినప్పుడు గూగుల్ అధికారిక యానిమేషన్ సీక్వెన్స్ కనిపిస్తుంది. ఇది తప్ప షేర్ చేయదగ్గ సమాచారం ఏదీ కనిపించలేదు. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వీడియో లీక్ అవ్వడం ఇది రెండోసారి. 

యూట్యూబ్ చానెల్ అన్‌బాక్స్ థెరపీ చానెల్లో ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేశారు. దీనికి సంబంధించిన హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లు కూడా టీజ్ చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీటితో పాటు పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ కానుంది.

గూగుల్ పిక్సెల్ 6ఏ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 6ఏ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ అందించింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 11 Sep 2022 04:41 PM (IST) Tags: Google Pixel 7 Pro Google Pixel 7 Pro Launch Google Pixel 7 Pro Design Google Pixel 7 Pro Features

సంబంధిత కథనాలు

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఫోన్ - రూ.14 వేలలోపే!

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఫోన్ - రూ.14 వేలలోపే!

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి