240W Fast Charging: 10 నిమిషాల్లోనే 100 పర్సెంట్ చార్జింగ్ - రూపొందిస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 240W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ఉన్న చార్జర్‌ను రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఐకూ త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఐకూ 10 ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో 200W వైర్డ్ చార్జింగ్ కెపాసిటీని అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వివో కూడా 200W వైర్డ్ చార్జింగ్ ఉన్న స్మార్ట్ ఫోన్‌పై పనిచేస్తున్నట్లు రూమర్లు ఎప్పట్నుంచో ఉన్నాయి.
ఇప్పుడు మరో చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఏకంగా 240W చార్జర్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ కంపెనీ అనేది తెలియరాలేదు. కానీ ఈ చార్జర్ ఇప్పటికే ట్రయల్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిజిటల్ చాట్ స్టేషన్ అనే ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం ఒక చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ 240W (24V / 10A) చార్జర్‌ను రూపొందిస్తుంది.
గతంలో వివో 200W ఫాస్ట్ చార్జింగ్‌ను రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వివో ఇటీవలే మనదేశంలో ఎక్స్80 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో టాప్ ఎండ్ వివో ఎక్స్80 ప్రోలో 80W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీని అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. ఒకవేళ 240W ఫాస్ట్ చార్జింగ్ చార్జర్, దాన్ని సపోర్ట్ చేసే ఫోన్ లాంచ్ అయితే ఆ ఫోన్ 10 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఐకూ కూడా సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్‌లను సపోర్ట్ చేయనుంది. గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఐకూ 10 ప్రోలో 200W ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మనదేశంలో లాంచ్ అయిన ఐకూ 9 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఐకూ 10 ప్రో లాంచ్ కానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. ఐకూ ఈ స్మార్ట్ ఫోన్‌ను జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram