Best Mobiles Under Rs 25000: రూ.25 వేలలోపు బెస్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - ఈ టాప్-5 లిస్ట్‌ను చూడండి!
ప్రస్తుతం మనదేశంలో రూ.25 వేలలోపు అందుబాటులో ఉన్న ఫోన్లు ఇవే!
Top 5 Smartphones under Rs 25000: ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎన్నో మంచి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి బడ్జెట్‌లోనూ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోనే ఉంటున్నాయి. ప్రస్తుతం మనదేశంలో రూ.10 వేల నుంచి రూ.30 వేల మధ్య ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం రూ.25 వేలలోపు ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఏంటో చూద్దాం.
రెడ్‌మీ కే50ఐ 5జీ
దీని ధర మనదేశంలో రూ.20,999గా ఉంది. ఈ ఫోన్‌లో వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5080 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
పోకో ఎక్స్5 ప్రో 5జీ
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.20,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉంది.
లావా అగ్ని 2 5జీ
ఈ స్మార్ట్ ఫోన్ కూడా బెస్ట్ సెల్లర్స్ లిస్టులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.21,999గా ఉంది. కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో మంచి ఫొటోలు తీసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
మోటొరోలా జీ82 5జీ
దీని ధర రూ.22,490గా ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6.6 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
రియల్‌మీ 11 ప్రో 5జీ
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ.23,999గా నిర్ణయించారు. 100 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సామర్థ్యం కాగా, బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు.
ఈ ఫోన్లు ప్రస్తుతం జరుగుతున్న సేల్స్‌లో తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రెడ్‌మీ 12 బడ్జెట్ మొబైల్ గత నెలలో కొన్ని దేశాల్లో లాంచ్ అయింది. మీడియాటెక్ జీ88 ప్రాసెసర్‌పై రెడ్‌మీ 12 పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఆగస్టు 1వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీని కూడా కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఈ మొబైల్‌లో చూడవచ్చు.
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial