అన్వేషించండి

Internet Usage in India: 2014 తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం - భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు!

Internet Broadband Connections in India: భారతదేశంలో గత పది సంవత్సరాల్లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది.

Mobile Internet Broadband Connections in India: దేశంలో మొబైల్ కనెక్షన్లు, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం నిరంతరం పెరుగుతోంది. గత 10 సంవత్సరాలలో దేశంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ మేరకు పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు.

గత దశాబ్ద కాలంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఎంత వరకు పెరిగాయని లోక్ సభ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, వై.ఎస్. అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఈ కాలంలో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ ఎంత వరకు పెరిగింది? ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఎంత పెరిగాయని కూడా అడిగారు.

దీనిపై రాష్ట్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ స్పందిస్తూ 2014 మార్చి 31వ తేదీ నాటికి వరకు 93.3 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉండగా, 2024 మార్చి 31వ తేదీ నాటికి వాటి సంఖ్య 119.87 కోట్లకు పెరిగిందన్నారు. ఈ కాలంలో మొత్తం వృద్ధి రేటు 28.48 శాతంగా ఉంది. ఈ డేటా 2014 నుంచి 2024 వరకు టెలికాం సర్వీస్ పనితీరు సూచికలపై ట్రాయ్ త్రైమాసిక నివేదిక నుంచి తీసుకున్నారు.

Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?

10 ఏళ్లలో బాగా పెరిగిన కలెక్షన్లు!
అదే సమయంలో 2014 మార్చి 31వ తేదీ వరకు దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 90.45 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 116.59 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వృద్ధి రేటు 28.90 శాతంగా ఉంది. ప్రభుత్వం తెలుపుతున్న దాని ప్రకారం 2014 మార్చి 31వ తేదీ నాటికి ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్ 25.16 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 95.44 కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో వృద్ధి రేటు 279.33 శాతంగా ఉంది.

బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్ 2014 మార్చి 31వ తేదీ నాటికి 6.09 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 92.41 కోట్లకు పెరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా స్వీకరించే వాటిలో టెలికాం రంగం కూడా ఒకటి. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget