అన్వేషించండి

Lightweight Laptops : బెస్ట్ లైట్ వెయిట్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా - ఐతే ఇక్కడ ఓ లుక్కేయండి

Lightweight Laptops : ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్స్, డిజైన్స్, ఫీచర్స్ తో పాటు తేలికగా ఉండే ల్యాప్ టాప్ లనే చాలా మంది ఇష్టపడుతున్నారు. అందులో ఈ బడ్జెట్ లో వచ్చే ల్యాప్ టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Lightweight Laptops : గతంలో కంప్యూటర్లకు చాలా డిమాండ్ ఉండేది. ఒకరి దగ్గర కంప్యూటర్ ఉందంటే చాలా గొప్పగా చూసేవాళ్లు. కానీ ఆ తర్వాత వచ్చిన ల్యాప్ ట్యాప్ లు కంప్యూటర్లను అధిగమించాయి. వీటి వినియోగం నేటి కాలంలో కామన్ అయిపోయింది. దాదాపు అందరూ ఏదో ఒక అవసరం కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో కొత్త కొత్త ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి లాంచ్ చేసే కంపెనీలూ పెరిగాయి. దానికి తోడు ఇప్పుడు లైట్ వెయిట్ ల్యాప్ టాప్ కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ప్రొఫెషనల్స్, ఉద్యోగులు, విద్యార్థులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అత్యాధునిక ఫీచర్లతో పాటు తక్కువ బరువుండే ల్యాపీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. ఇది మన బడ్జెట్ ను బట్టి సుమారు రూ.40 వేల లోపు నుంచి రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువకు కూడా వివిధ కంపెనీల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. లైట్ వెయిట్ తో పాటు అందులో బ్యాటరీ లైఫ్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్, డిజైన్ వంటి విషయాల్లోనూ బెస్ట్ అనిపించే కొన్ని ల్యాప్ టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసర్ ఆస్పైర్ లైట్ (Acer Aspire Lite)

ఇది ల్యాప్ టాప్ కేవలం 1.59 కిలోల బరువుతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది. స్లిమ్ బెజెల్స్‌తో కూడిన 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే తో పాటు ఓల్డ్ 16:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇది 3:2 స్క్రీన్‌లతో పోలిస్తే కాస్త తక్కువ ఆధునికంగా అనిపించవచ్చు. ఏఎండీ రైజెన్ 5-5625U హెక్సా-కోర్ ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ రేడియన్ గ్రాఫిక్స్‌తో రోజూవారి పనులను ఈజీగా చేసుకునే వెసులుబాటు అందిస్తుంది.  512 జీబీ స్టోరేజీతో పుష్కలమైన స్పేస్ ను అందిస్తుంది. దీన్ని అవసరమైతే 1TB వరకు పెంచుకోవచ్చు. ఇందులో పాత USB 2.0 పోర్ట్ ను అమర్చారు. అయినప్పటికీ ఇది స్టూడెంట్స్ కు, ఎక్స్పర్ట్స్ కు లో తక్కువ బడ్జెట్ లో లభించే పటిష్టమైన పనితీరును అందించే స్మార్ట్ పిక్ అని చెప్పవచ్చు.

ఇన్ బుక్ ఎయిర్ ప్రో+ (Infinix INBook Air Pro+)

సొగసైన, అత్యంత పోర్టబుల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎయిర్ ప్రో+ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది కేవలం 1కిలో బరువు మాత్రమే ఉంటుంది. 14-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 100% sRGB, DCI-P3 కవరేజీతో పాటు ఫేస్ రికగ్నిషన్‌తో కూడిన FHD+ IR వెబ్‌క్యామ్ ను కలిగి ఉంటుంది. ఇందులో 57Wh బ్యాటరీపై 8 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు.

హానర్ మ్యాజిక్‌బుక్ X16 ప్రో (HONOR MagicBook X16 Pro)

ఈ ల్యాప్ టాప్ 13 జనరేషన్ ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్ (8 కోర్స్, 12 థ్రెడ్స్), 16 జీబీ LPDDR4X ర్యామ్, 512 జీబీ NVMe SSDతో పాటు 16 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే తో వస్తుంది. ఇది కేవలం 1.7కిలోల బరువు 17.9 మి.మి. మందంతో 65W టైప్-సి ఫాస్ట్ ఛార్జర్ ను కలిగి ఉంటుంది. ఇది దాదాపు 11 గంటల పని తీరుకు అనుమతిస్తుంది.

లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 (Lenovo IdeaPad Slim 3)

ఇది కేవలం .62 కిలోల బరువు, 1.79 సెం.మీ మందంతో 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే తో వస్తుంది. మీరు ఇందులో విండోస్ 11 (Windows 11), Office Home 2024, 3-నెలల Xbox GamePass సబ్‌స్క్రిప్షన్‌ను ప్రీలోడెడ్‌గా పొందుతారు.

హెచ్ పీ ల్యాప్‌టాప్ 14 (HP Laptop 14)

300 నిట్స్ బ్రైట్‌నెస్‌, 14-అంగుళాల FHD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో పాటు కేవలం 1.4 కిలోల బరువున్న ఈ ల్యాపీని మీరు ఎక్కడికెళ్లినా తీసుకెళ్లడం చాలా సులభం. దీని ఫుల్ ఛార్జ్ తో మీరు దాదాపు 8 గంటల 45 నిమిషాల పాటు నిర్విరామంగా వినియోగించుకోవచ్చు. 

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 (Apple MacBook Air M2)

15-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ M3 గత సంవత్సరం 15-అంగుళాల ఎయిర్ మోడల్‌ను భర్తీ చేసింది.  ఇది 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే (2560 × 1664 రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్) తో స్ఫుటమైన విజువల్స్,  వైబ్రెంట్ రంగులను అందిస్తుంది. కేవలం 1.24 కిలోల బరువుతో 18-గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. 

Also Read : iPhone SE 4 : ఐఫోన్​ SE 4 లీక్స్.. ఊహించని అప్​గ్రేడ్​తో వచ్చేసిన ఐఫోన్ SE 4, ధర ఎంత ఉండొచ్చంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi HC Judge Transferred After Cash Recovery | హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా దొరికిన నోట్ల కట్టలు | ABP DesamSunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Viral News: ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Embed widget