By: ABP Desam | Updated at : 31 Jul 2023 07:39 PM (IST)
జియోబుక్ 2023 ( Image Source : Jio )
జియోబుక్ 2023 ల్యాప్‌టాప్ భారతదేశంలో లాంచ్ అయింది. జియో లాంచ్ చేసిన రెండో తరం ల్యాప్‌టాప్ ఇది. దీన్ని ప్లాస్టిక్ బాడీతో రూపొందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8788 ప్రాసెసర్‌పై జియోబుక్ 2023 పని చేయనుంది. జియో బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఇన్‌బిల్ట్ సిమ్ కార్డుతో జియో ల్యాప్ టాప్ రానుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్‌డీఎంఐ మినీ పోర్టు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది.
జియోబుక్ 2023 ధర
దీని ధరను మనదేశంలో రూ.16,499గా నిర్ణయించారు. జియో బ్లూ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, రిలయన్స్ డిజిటల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 5వ తేదీన దీని సేల్ ప్రారంభం కానుంది. రిలయన్స్ మొదటి జియోబుక్ గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయింది. దీని ధర లాంచ్ అయినప్పుడు రూ.15,799గా ఉంది.
జియోబుక్ 2023 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఆధారిత జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది. ఇందులో 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉండనుంది. ఈ 4జీ ల్యాప్‌టాప్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. 4జీ సిమ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించనున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8788 ప్రాసెసర్ ద్వారా జియోబుక్ 2023 రన్ కానుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
గత సంవత్సరం లాంచ్ అయిన జియోబుక్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను అందించారు. వైఫై, బ్లూటూత్ 5, హెచ్‌డీఎంఐ మినీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 2 మెగా పిక్సెల్ వెబ్ కెమెరా కూడా ఉండనున్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఎనిమిది గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. జియోబుక్ 2023 బరువు కూడా చాలా తక్కువగా ఉండనుంది. కేవలం 990 గ్రాముల బరువుతోనే ఈ ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి రానుంది. గతేడాది లాంచ్ అయిన జియోబుక్ ల్యాప్‌టాప్ బరువు 1.2 కిలోలుగా ఉంది.
Welcome your ultimate learning book - JioBook. An all-in-one solution for learning anything, anytime, anywhere. 😎
— Reliance Jio (@reliancejio) July 31, 2023
Pre-order your all new JioBook now https://t.co/5jnRKhPN4B#AllNewJioBook #AllNewJioBookLaptop #Laptop #Jio #Learning #Entertainment pic.twitter.com/Yo16aXMLGv
#JioFiber Entertainment Bonanza just got even more exciting. Enjoy inspiring documentaries and classics with Docubay and Epic On - Now available with select JioFiber plans.
— Reliance Jio (@reliancejio) July 24, 2023
Book now https://t.co/P7SfeYy7hS#WithLoveFromJio pic.twitter.com/GIwfGQEK7k
Honour your true connections by gifting #JioBharat to the parental figures who go above and beyond for us every day. ❤️#WithLoveFromJio #JioBharat #ParentsDay #Gift pic.twitter.com/X6aES7mbtd
— Reliance Jio (@reliancejio) July 23, 2023
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!
Best Laptop Under 50000: రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, డిజైన్‌లో బెస్ట్ ఇవే!
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - లేకపోతే మార్చుకోవడమే!
Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
/body>