అన్వేషించండి

Laptop ఛార్జింగ్‌లో పెట్టి పని చేస్తున్నారా? బ్యాటరీ పాడవుతుందా? నిపుణుల సలహా తప్పక తెలుసుకోండి! Laptop Tips

Laptop Tips: ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వాడటం సురక్షితమే. కానీ ఇది తరచుగా చేస్తే బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. మరిన్ని చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.

Laptop Battery Life Tips: ల్యాప్‌టాప్‌పై ఎక్కువ సమయం పని చేస్తున్న వారు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. పదే పదే ఛార్జింగ్ డౌన్‌ అవుతుందని ఛార్జింగ్‌లో ఉంచే పని చేస్తుంటారు. "ఇలా చేయడం వల్ల ల్యాప్‌టాప్ పాడవుతుందా?" అనే ప్రశ్న మీ మనసులో తప్పకుండా వస్తుంది. నిపుణులు దీని గురించి ఏమంటున్నారో, ఈ అలవాటు ల్యాప్‌టాప్ బ్యాటరీ, పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

ఛార్జింగ్‌లో పని చేయడం సురక్షితమేనా?
సాధారణంగా, ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఉపయోగించడం ప్రమాదకరం కాదు. నేడు వస్తున్న లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు స్మార్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇవి ఓవర్‌ ఛార్జింగ్ నుంచి రక్షణ పొందగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అంటే, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అప్పుడు ల్యాప్‌ట్యాప్‌ నేరుగా AC పవర్ నుంచి పని చేయడం ప్రారంభిస్తుంది.

బ్యాటరీపై ఎప్పుడు ప్రభావం ఉంటుంది?  
మీరు ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఛార్జింగ్‌లో పెట్టి ఉపయోగిస్తే మాత్రం కచ్చితంగా ప్రభావం ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతుంది. అంటే బ్యాటరీ పూర్తిగా పాడవుతుందని కాదు, కానీ దాని పనితీరులో కొంచెం తేడా రావచ్చు. ముఖ్యంగా మీరు వీడియో ఎడిటింగ్ లేదా గేమింగ్ వంటి చాలా హీటింగ్ పనుల కోసం ల్యాప్‌టాప్‌ ఉపయోగిస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. అలా హీటెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్‌ స్పాన్ తగ్గిపోతుంది.  

బ్యాటరీ లైఫ్‌ కోసం ఏమి చేయాలి?

  • బ్యాటరీని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు అనుసరించవచ్చు:
  • ఎల్లప్పుడూ బ్యాటరీని పూర్తిగా అయిపోక ముందు ఛార్జ్ చేయండి.
  • ల్యాప్‌ట్యాప్‌ హీటెక్కినప్పుడు కొంత సమయం పాటు ఆఫ్ చేయండి.
  • ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పాటు ప్లగ్ ఇన్ మోడ్‌లో మాత్రమే ఉపయోగిస్తుంటే, అప్పుడప్పుడు బ్యాటరీపై కూడా ఉపయోగించండి. అంటే ఛార్జింగ్ తీసేసే వాడాల్సి ఉంటుంది. 

నిపుణుల అభిప్రాయం

ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో ఉపయోగించడం పూర్తిగా సురక్షితమని టెక్ నిపుణులు చెబుతున్నారు. కానీ బ్యాటరీ పనితీరు ఎక్కువ కాలం పాటు సురక్షితంగా ఉండాలంటే  బ్యాలెన్స్‌ పాటించాలి. అంటే, ఎల్లప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచవద్దు. అలా అని చెప్పి బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యే వరకు ఎదురు చూడొద్దు. అది కూడా బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది.  

ఫలితం ఏమిటి?
మొత్తంమీద, ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి పని చేయడం ఏ విధంగానూ హానికరం కాదు, కానీ కొంచెం తెలివిగా ఉంటూ ఉపయోగించడం అవసరం. మీరు కొన్ని సాధారణ విషయాలు గుర్తుంచుకుంటే, మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ కూడా ఎక్కువ కాలం బాగా  పని చేస్తుంది. పనితీరు కూడా బాగుంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Embed widget