Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పని చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
How to Make Your Smartphone Last Longer: కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి మనమంతా ఎన్నో పరిశోధనలు చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారు. ఇది కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు సులభంగా వాడాలనుకుంటారు.
కొంత మంది కొత్త ఫోన్‌ను తీసుకుంటారు. కాని దానిని జాగ్రత్తగా చూసుకోరు. అప్పుడు ఒకటి లేదా రెండు సంవత్సరాలలో బ్యాటరీ సమస్య వస్తుంది లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ లేదా ఇతర భాగాలు దెబ్బతింటాయి. దీని వెనుక ప్రధాన కారణం మనం మొబైల్ ఫోన్‌లను సరిగ్గా చూసుకోకపోవడమే. ఇప్పుడు మొబైల్ ఫోన్ లైఫ్ పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం.
బ్యాటరీ, ఛార్జర్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఎక్కువ సార్లు ఛార్జ్ చేస్తే అది బ్యాటరీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొంతమందికి 50 శాతం లేదా 60 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు కూడా మొబైల్‌ను ఛార్జ్‌లో ఉంచే అలవాటు ఉంది. మొబైల్ ఫోన్‌ను బ్యాటరీ 20 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు ఛార్జ్‌లో ఉంచాలని సలహా ఇస్తారు. స్మార్ట్‌ఫోన్‌తో అందించిన ఛార్జర్‌ను లేదా మొబైల్ ఫోన్‌కు సపోర్ట్ చేసే ఛార్జర్‌ను ఉపయోగించి బ్యాటరీని ఛార్జ్ చేయండి.
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఆఫ్ అవ్వడానికి ముందే ఛార్జ్‌లో ఉంచండి. ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు లిథియం అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. ఇవి పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు పనితీరును తగ్గిస్తాయి.
స్టోరేజ్
కొంతమంది వ్యక్తుల స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ 32 జీబీ లేదా 64 జీబీ ఉంటుంది. వారు తమ మొబైల్ ఫోన్‌లో చాలా డేటాను నింపుతారు. వారి స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర వ్యవధిలో నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇవన్నీ నివారించడానికి, మొబైల్ ఫోన్ వేగంగా పని చేయడానికి, క్లౌడ్ స్టోరేజ్ సహాయం తీసుకోండి లేదా డేటాను హార్డ్ డిస్క్‌లో ఉంచండి.
వెరిఫైడ్ యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి
వెరిఫైడ్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే మీ ఫోన్‌లో యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. స్మార్ట్‌ఫోన్‌లో ఏపీకే ఫైల్, బ్లూటూత్ నుంచి ఫైల్స్‌ను తీసుకోకండి. ఎందుకంటే వైరస్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే మీ మొబైల్ ఫోన్ కూడా దెబ్బతింటుంది.
అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉండండి
మన స్మార్ట్‌ఫోన్‌లలో షెడ్యూల్ రీస్టార్ట్ ఆప్షన్‌ను కంపెనీలు ఇస్తాయని మీకు తెలుసా? వాస్తవానికి ఈ ఫీచర్ ముందే అందుబాటులోనే ఉంది. దీని ద్వారా ఒక వారం లేదా రెండు నుండి మూడు రోజులకు ఒకసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. దీని ద్వారా టెంపరరీ ఫైల్స్, హిస్టరీ, కాష్ డేటా మొదలైనవి అన్ని రిమూవ్ అవుతాయి. మీ మొబైల్ ఫోన్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది.
మొబైల్ ఇంటర్నెట్ వేగం పెంచడానికి క్రాష్, కుక్కీలను క్లియర్ చేయాలి. ఇలా చేయడం వలన మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగవంతం అవుతుంది. ఫోన్ లో డేటా సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది.