Fake Messages: జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అలెర్ట్ - ట్రాయ్ ఏం చెప్తుంది?
TRAI Alert: ఫేక్ మెసేజ్‌ల గురించి యూజర్లకు అలెర్ట్ చేయాలని జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ కంపెనీలను ట్రాయ్ కోరింది.
Telecom Users: టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కోరింది. ఈ హెచ్చరిక ద్వారా సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు పంపే మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులను కోరనున్నాయి.
ఎకనామిక్ టైమ్స్‌తో ట్రాయ్ కార్యదర్శి వి.రఘునందన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు టెలికాం కంపెనీలు, ట్రాయ్ పేరుతో ప్రజలకు తప్పుడు సందేశాలు పంపుతూ వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ వినియోగదారులందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్న ఉద్దేశంగా ప్రజలకు సలహా ఇవ్వాలనికి హెచ్చరిక సందేశాన్ని పంపాలనుకుంటున్నట్లు తెలిపారు.
వాస్తవానికి గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వేలాది మంది సైబర్ నేరగాళ్లు టెలికాం కంపెనీల టవర్లను ఏర్పాటు చేస్తామని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని లేదా కనెక్షన్ క్లోజ్ చేస్తామని బెదిరిస్తూ ప్రజలను కుదిరితే భయపెడుతూ లేదా ఆకర్షిస్తూ మోసం చేస్తున్నారు. ఆపై మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ వంటి వాటిని అడగడం ద్వారా బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు డబ్బు కాజేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు.
ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అందుకే వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయాలని ట్రాయ్ అన్ని కంపెనీలను కోరింది. ఈ హెచ్చరికలో ఒక ప్రత్యేక మెసేజ్ ఉంటుంది. అందులో మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయడానికి, నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేయడానికి లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివేదించడానికి ట్రాయ్ వినియోగదారులకు కాల్ చేయదు, మెసేజ్‌లు పంపదు అని అందులో పేర్కొంటారు.
ట్రాయ్ పేరుతో వచ్చే ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ట్రాయ్ పేరిట వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లపై ఏదైనా చర్య తీసుకునే ముందు అవి సరైనవో కాదో చూసుకోవడం ముఖ్యం. వినియోగదారులు ఇటువంటి విషయాలను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు నివేదించవచ్చు.
మరోవైపు కొత్త సంవత్సరాన్ని మొబైల్ కంపెనీలు గ్రాండ్‌గా స్టార్ట్ చేయనున్నాయి. రెడ్‌మీ, వివో కంపెనీలకు సంబంధించిన ఐదు ఫోన్లు రేపు (జనవరి 4వ తేదీ) భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వీటిలో బడ్జెట్, మిడ్, ఫ్లాగ్‌షిప్ నుంచి ప్రీమియం కేటగిరీ వరకు అన్ని విభాగాలు ఉన్నాయి. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే వీటిలో ఒకదాన్ని ప్రిఫర్ చేయవచ్చు.
మరోవైపు కొత్త సంవత్సరాన్ని మొబైల్ కంపెనీలు గ్రాండ్‌గా స్టార్ట్ చేయనున్నాయి. రెడ్‌మీ, వివో కంపెనీలకు సంబంధించిన ఐదు ఫోన్లు రేపు (జనవరి 4వ తేదీ) భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వీటిలో బడ్జెట్, మిడ్, ఫ్లాగ్‌షిప్ నుంచి ప్రీమియం కేటగిరీ వరకు అన్ని విభాగాలు ఉన్నాయి. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే వీటిలో ఒకదాన్ని ప్రిఫర్ చేయవచ్చు. రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్లు, వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్లు రేపు మార్కెట్లోకి రానున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!