Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!
Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401.
Jio AirFiber: జియో గత కొన్ని నెలలుగా భారతదేశంలోని పలు నగరాల్లో ఎయిర్ ఫైబర్ పేరుతో తన కొత్త ఫైబర్ సర్వీసును లాంచ్ చేసింది. ఇది వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసు. దీని ద్వారా వినియోగదారులు హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సర్వీసులను పొందుతారు. 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ స్పీడ్‌ను జియో ఎయిర్‌ఫైబర్ అందించగలదని కంపెనీ పేర్కొంది. వాణిజ్య, గృహ అవసరాల కోసం కంపెనీ ఈ కొత్త ఫైబర్ సర్వీసును రూపొందించింది.
జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ప్రస్తుతం భారతదేశంలోని 500 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు పరిధి పెరుగుతున్నందున కంపెనీ దీనికి అనేక కొత్త ఫీచర్లను జోడిస్తోంది. వాటిలో ఒకటి డేటా బూస్టర్ ప్లాన్. వినియోగదారులు తమ రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్‌లను ప్రారంభించింది. వీటి గురించి తెలుసుకుందాం.
జియో ఎయిర్‌ఫైబర్ మూడు డేటా బూస్టర్ ప్లాన్‌లు
1. జియో ఎయిర్‌ఫైబర్ మొదటి డేటా బూస్టర్ ప్లాన్ ధర రూ. 101. దీనిలో వినియోగదారులు వారి బేస్ ప్లాన్‌తో సమానమైన స్పీడ్‌తో 100 జీబీ అదనపు డేటాను పొందుతారు.
2. జియో ఎయిర్‌ఫైబర్ రెండో డేటా బూస్టర్ ప్లాన్ ధర రూ. 251. దీనిలో వినియోగదారులు వారి బేస్ ప్లాన్‌కు సమానమైన స్పీడ్‌తో 500 జీబీ అదనపు డేటాను పొందుతారు.
3. జియో ఎయిర్‌ఫైబర్ మూడో డేటా బూస్టర్ ప్లాన్ ధర రూ. 401, దీనిలో వినియోగదారులు వారి బేస్ ప్లాన్‌తో సమానమైన స్పీడ్‌తో 1000 జీబీ అదనపు డేటాను పొందుతారు.
జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మై జియో యాప్, జియో.కామ్‌లో అందుబాటులో ఉన్నాయి. జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్‌లందరూ ఈ ప్లాన్‌లను ఉపయోగించవచ్చు. ఎయిర్ ఫైబర్‌లో వినియోగదారులు మొత్తం ఆరు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ఇవే...
జియో ఎయిర్ ఫైబర్ కోసం కంపెనీ మొదట రూ.599, రూ.899, రూ.1199 మూడు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.599 ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ అందించారు. రూ.899, రూ.1199 ప్లాన్లలో, 100 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉంటుంది. రూ.599, రూ.899 ప్లాన్‌లతో 13 ఓటీటీ యాప్స్‌కు సంబంధించిన ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ. 1199 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం వంటి 15 ఓటీటీ యాప్స్‌ను కూడా పొందుతారు. ఈ మూడు ప్లాన్‌ల్లోనూ కస్టమర్‌లు 550 కంటే ఎక్కువ ఉచిత డిజిటల్ టీవీ ఛానెల్స్‌ను కూడా పొందుతారు.
దీంతోపాటు ఎయిర్ ఫైబర్ మ్యాక్స్‌లో అనే మూడు కొత్త ప్లాన్లు కూడా ఉన్నాయి. రూ.1,499 ప్లాన్ ద్వారా 300 ఎంబీపీఎస్ వేగంతో 1000 జీబీ డేటా లభించనుంది. రూ.2,499 ప్లాన్ ఎంచుకుంటే 500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ అందిస్తున్నారు. ఇక టాప్ ఎండ్ రూ.3,999 ప్లాన్ ద్వారా 1 జీబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ లభిస్తుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!