iPhone 16 Sales: భారీగా అమ్ముడుపోతున్న ఐఫోన్ 16 సిరీస్ - ఆ ఒక్కటి తగ్గిస్తే ఎగబడుతున్న జనం!
iPhone 16 Pro Series Sales: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రో మోడల్స్‌కు డిమాండ్ విపరీతంగా ఎక్కువ అయింది. కేవలం బడా నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న నగరాల్లో కూడా వీటి సేల్ పెరుగుతోంది.
iPhone 16 Pro Sales: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌పై ప్రజల్లో క్రేజ్ ఉంది. లాంచ్ అయిన తర్వాత కూడా దాని ధర, డిజైన్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. ఈ కొత్త ఫోన్ సేల్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఐఫోన్ 16 సిరీస్‌కు, ముఖ్యంగా ప్రో మోడల్‌లకు ఈ మధ్య కాలంలో డిమాండ్ ఎక్కువ అయింది.
టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మునుపటి మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్స్‌కు మనదేశంలో భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణం ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త ఐఫోన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి. కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా ఈ హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఐఫోన్ 16 సిరీస్‌లో పెద్ద డిస్‌ప్లే, లేటెస్ట్ ప్రో కెమెరా ఫీచర్‌లు, మెరుగైన గేమింగ్ గ్రాఫిక్స్, ఏ18 ప్రో చిప్ ఉన్నాయి. అంతే కాకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా వీటిలో లభించనున్నాయి.
కానీ ఐఫోన్ 14 ప్రో సిరీస్, ఐఫోన్ 15 ప్రో సిరీస్ కంటే ఎక్కువగా లాంచ్ అయిన నాటి నుంచే ఐఫోన్ 16 ప్రో సిరీస్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం ధర తగ్గించడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ల కంటే ఐఫోన్ 16 ప్రో సిరీస్ ఏకంగా రూ.15 వేలు తక్కువ ధరతో లాంచ్ అయ్యాయి. ఇది సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఐఫోన్ 16 సిరీస్ ప్రత్యేకతలు ఇవే...
ఐఫోన్ 16లో ఏ15 బయోనిక్ చిప్‌ను అందించారు. ఇది పాత ఐఫోన్ 14 కంటే 50 శాతం వేగంగా ఉంటుంది. అయితే కొత్త ఏ18 చిప్‌సెట్ గొప్ప గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రో మాక్స్ వేరియంట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.9 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను పొందుతుంది. ఐఫోన్ 16 ప్రో బరువు 199 గ్రాములు కాగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 227 గ్రాముల బరువు ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్రో సిరీస్ కూడా ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే ఏ18 ప్రో ఒక ముఖ్యమైన సాంకేతిక పురోగతి. ఇది 16 కోర్ న్యూరల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్, కొత్త సిరి అవతార్ కోసం ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఈ మోడల్స్ అన్నీ ఐవోఎస్ 18తో లాంచ్ అవుతాయి.
కొత్త ఏ18 ప్రో చిప్ వినియోగదారులకు ఐఫోన్‌లో అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది. దీని కొత్త 16 కోర్ నేచురల్ ఇంజన్ మునుపటి ఫోన్ కంటే వేగంగా, మరింత అధునాతనంగా ఉంది.
ఐఫోన్ 16 ప్రో సిరీస్ ధర ఎంత?
ఐఫోన్ 16 ప్రో 128 జీబీ – రూ. 1,19,900.
ఐఫోన్ 16 ప్రో 256 జీబీ – రూ. 1,29,900.
ఐఫోన్ 16 ప్రో 512 జీబీ – రూ. 1,49,900.
ఐఫోన్ 16 ప్రో 1 టీబీ – రూ. 1,69,900.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 జీబీ – రూ 1,44,900.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 512 జీబీ – రూ. 1,64,900.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 1 టీబీ – రూ. 1,84,900.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే