Infinix Hot 11 2022: రూ.10 వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - టీజ్ చేసిన కంపెనీ - ఎలా ఉందో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ హాట్ 11 2022ను టీజ్ చేసింది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు కూడా లీకయ్యాయి. ఇన్‌ఫీనిక్స్ ఇండియా సీఈవో అనీష్ కపూర్ దీనికి సంబంధించిన టీజర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. స్మార్ట్ ఫోన్ పేరును తెలపకపోయినా ఇది ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 అయ్యే అవకాశం ఉంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 ఫీచర్లు
ఈ ట్వీట్ ప్రకారం... త్వరలో లాంచ్ కానున్న ఇన్‌ఫీనిక్స్ ఫోన్ పక్కభాగం ఫ్లాట్‌గా ఉండనుంది. అలాగే సన్నటి గ్లాసీ లుక్ కూడా ఇందులో ఉండనుంది. దీంతోపాటు ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు. దీని ధర రూ.10 వేలలోపే ఉండనుంది.
దీంతోపాటు ఇందులో పంచ్ హోల్ సెటప్ ఉండనుంది. అరోరా గ్రీన్, పోలార్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఫోన్ వెనక పైభాగంలో ఎడమవైపు ఈ కెమెరా సెటప్ ఉండనుంది. కెమెరా సెన్సార్లతో పాటు ఫ్లాష్ కూడా అందించనున్నారు.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉండనుంది. ఫోన్ కిందభాగంలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ ఉండనున్నాయి. ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా షేర్ చేయలేదు. లాంచ్ తేదీ దగ్గరయ్యే లోపు ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో ఆండ్రాయిడ్ ఎక్స్3 స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 32 అంగుళాల వేరియంట్ ధర రూ.11,999 కాగా... 43 అంగుళాల వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు.
ఈ స్మార్ట్ టీవీల్లో యాంటీ బ్లూ రే టెక్నాలజీని అందించారు. వీటిలో డాల్బీ స్టీరియో సౌండ్ సిస్టం కూడా ఉండటం విశేషం. 32 అంగుళాల టీవీ 20W సౌండ్ అవుట్‌పుట్‌ను, 43 అంగుళాల టీవీ 36W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించనుంది. ఇందులో రెండు బాక్స్ స్పీకర్లు, రెండు ట్వీటర్లు ఉన్నాయి.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?