(Source: ECI/ABP News/ABP Majha)
India’s Metaverse Wedding: మెటాలో పెళ్లంట, ఎవరైనా రావచ్చంట!
దేశంలోనే మొదటిసారి మెటావర్స్‌లో పెళ్లి జరుగుతోంది.
దేశంలోనే మొదటి సారి మెటావర్స్‌లో వివాహం జరగనుంది. అభిజిత్, సంస్రాతి అనే జంట మెటావర్స్ ద్వారా వివాహం చేసుకున్న మొదటి జంటగా నిలవనున్నారు. పెళ్లి కొడుకు అభిజిత్ వ్యాపారి కాగా.. పెళ్లి కూతురు సంస్రాతి డాక్టర్. ఫిజికల్‌గా ఈ పెళ్లికి రాలేకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా తమకు కావాల్సిన వారు వర్చువల్ పద్ధతిలో ఈ వివాహాన్ని చూడవచ్చని ఆ జంట అంటోంది.
ఈ పెళ్లిని చూడటానికి ఏం చేయాలి?
1. యుగ్‌లోకి లాగిన్ అవ్వాలి.
2. యుగ్ ప్లాట్‌ఫాంని డౌన్‌లోడ్ చేసుకోవాలి. (ఐవోఎస్, ఆండ్రాయిడ్, వీఆర్, విండోస్ ప్లాట్‌ఫాంల్లో అందుబాటులో ఉంది.)
3. మీ అవతార్‌ను ఎంచుకోవాలి.
4. వెడ్డింగ్ ఈవెంట్‌ను ఎంచుకోవాలి.
5. వేదికకు వచ్చి, జంటను పలకరించి, అతిథులతో మాట్లాడి రిటర్న్ గిఫ్ట్‌లు తీసుకుని ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
అలాగే రేపు (ఫిబ్రవరి ఆరో తేదీ) మరో జంట కూడా మెటావర్స్‌లో వివాహం చేసుకోనుంది.
View this post on Instagram
View this post on Instagram