అన్వేషించండి

India Vs Bharat Controversy: దేశం పేరు మారితే ఈ వెబ్‌సైట్లకు కష్టాలు- ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు?

India Vs Bharat Controversy:  దేశంలో చాలా వెబ్‌సైట్లు .ఇన్(.in) డొమైన్‌తో నడుస్తున్నాయి. ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. 

India Vs Bharat Controversy: ఇండియా పేరు మార్పు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని చూస్తున్నాం. ఈ పేరు మార్పుతో కొన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్పు చేయడం ద్వారా దేశంలోని సాంకేతికంగా చాలా సమస్యలు ఎదురవుతాయని టెక్ నిపుణలు భావిస్తున్నారు. దేశంలో చాలా వెబ్‌సైట్లు .ఇన్(.in) డొమైన్‌తో నడుస్తున్నాయి. ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. 

ఇన్ని రోజులు ఇండియా పేరు ఉంది కాబట్టే India స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన In ఆయా వెబ్‌సైట్ల పేరు చివరన డొమైన్లుగా పెట్టుకున్నాయి. ఈ .In డొమైన్‌ను కంట్రీ కోడ్‌ టాప్‌ లేయర్‌ డొమైన్‌ అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే ఈ డొమైన్‌ భారత్‌ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అప్పుడు కొత్తగా భారత్‌ స్ఫురించేలా కొత్త టీఎల్‌డీ(డొమైన్‌)కు మారాల్సి ఉంటుంది. భారత్‌ Bharat ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌లోని బీహెచ్‌ లేదా బీఆర్‌ అక్షరాలతో .bh లేదా .br  కొత్త డొమైన్‌ను వాడాలి. 

అయితే ఇప్పటికే .bhను బహ్రెయిన్‌ దేశానికి, .brను బ్రెజిల్‌ దేశానికి, .btను భూటాన్‌కు కేటాయించారు. దీంతో .bh, .br డొమైన్లు భారత్‌కు వచ్చే అవకాశమే లేదు. అయితే దీనికో పరిష్కారం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. డొమైన్ తీసుకోవడం పెద్ద కష్టం కాదని. డొమైన్‌లోని అక్షరాలను పెంచుకుని .BHARAT, లేదా .BHRT  అనే కొత్త డొమైన్లను తీసుకోవచ్చని చెబుతున్నారు. కొత్త డొమైన్‌కు మారినాసరే ఆయా వెబ్‌సైట్లు పాత డొమైన్‌లనూ కొనసాగించవచ్చని అంటున్నారు. 

ఒక్కో డొమైన్‌ ఒక్కో దేశాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు .uk అనగానే బ్రిటన్‌ వెబ్‌సైట్లు, .us అనగానే అమెరికా వెబ్‌సైట్లు .cs అనగానే చైనా వెబ్‌సైట్లు గుర్తొస్తాయి. అలాగే .in అంటే భారత్ గుర్తొచ్చేది. భారత్‌లోని చాలా ప్రముఖమైన వెబ్‌సైట్లు సైతం తమ ఐడెంటిటీని .inతోనే నిలబెట్టుకున్నాయి. మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్‌ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్‌సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టం.

అలాగే .In లా వెంటనే భారత్‌ను గుర్తుపట్టేలా ఇప్పుడు కొత్త డొమైన్‌ అందుబాటులో లేదు. చాలా వెబ్ సైట్లకు ఇదే ప్రధాన సమస్య. ఎన్‌ఐఎక్సై్‌స్ వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్‌ డొమైన్‌ను రిజిస్టర్‌ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. ఇందులో gov.in, mil.in ప్రధానమైనవి. ఇందులో gov.in డొమైన్‌ను భారత, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. mil.in అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది.

అయితే డొమైన్ మార్పు, నిర్వహణలో వచ్చే ఇబ్బందేమీ లేదని టెక్ నిపుణుల అభిప్రాయం. కాని నకిలీ వెబ్‌సైట్ల బెడద ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని, అయితే ఆయా సంస్థల అసలు వెబ్‌సైట్‌ ఏది అనేది గుర్తించడం కష్టమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఆర్థిక సంక్షోభానికి కారణం అవ్వొచ్చనే ఆందోళన ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget