Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!
భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు.
Indian Internet Users: భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ గణాంకాలు ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (IIGF) రెండో ఎడిషన్‌లో అందించారు. భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించే వినియోగదారుల సంఖ్య 80 కోట్లను దాటిందని గణాంకాలలో వెల్లడి అయింది.
దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను మంత్రి విడుదల చేశారు. 80 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద 'కనెక్ట్' దేశంగా మారిందన్నారు. 5జీ, అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ అయిన BharatNet 120 కోట్ల బిలియన్ భారతీయ వినియోగదారులను కలిగి ఉందని, గ్లోబల్ ఇంటర్నెట్‌లో వీరిది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు అప్‌డేట్ చేసిన రెగ్యులేటరీ పాలసీలతో కొనసాగాలని భావిస్తున్నామని తెలిపారు. ఇది భారతీయ ఇంటర్నెట్‌ను, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడనుంది.
అనేక అంశాలపై చర్చ
జీ20కి భారతదేశ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్లోబల్ సౌత్‌లోని డిజిటల్ ఎకానమీని మార్చడానికి ఆసక్తి ఉన్న దేశాలకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో చాలా మంది వాటాదారులు భారతదేశ డిజిటలైజేషన్, ఇంటర్నెట్‌కు సంబంధించి గత, వర్తమాన, భవిష్యత్తు రోడ్‌మ్యాప్ గురించి చర్చించారు.
పౌరసమాజం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వాలకు చెందిన వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించే మార్గాలను కనుగొనడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ తెలిపారు.
View this post on Instagram
View this post on Instagram