(Source: ECI/ABP News/ABP Majha)
Huawei Nova Y9a: హువావే కొత్త ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే హువావే నోవా వై9ఏ.
హువావే నోవా వై9ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో ఎప్పుడో మర్చిపోయిన పాపప్ సెల్ఫీ కెమెరాను కంపెనీ అందించడం విశేషం. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది.
హువావే నోవా వై9ఏ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ దక్షిణాఫ్రికాలో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 6,499 దక్షిణాఫ్రికా రాండ్లుగా (సుమారు రూ.31,300) నిర్ణయించారు. మిడ్ నైట్ బ్లాక్, సకురా పింక్, స్పేస్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
హువావే నోవా వై9ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఈఎంయూఐ 10.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.63 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్, గ్రావిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా.. 40W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా.. బరువు 197 గ్రాములుగా ఉంది.
View this post on Instagram