Facebook Deactivate: ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్/ డీయాక్టివేట్ చేయడం ఎలాగో తెలుసా? Step by Step Process
Delete Facebook Account | మీరు టైంపాస్ కోసం క్రియేట్ చేసుకున్న ఫేస్‌బుక్ అకౌంట్ తో మీరు ఇబ్బందులు పడుతున్నారా..? అయితే మీ అకౌంట్‌ను ఎలా డిలీట్ చేసుకోవాలో చూద్దాం పదండి
Delete or Deactivate Facebook Account |ఫేస్‌బుక్ ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది. సినిమా, బిజినెస్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, పాలిటిక్స్.. ఇలా ఏ విధమైన ప్రచారమైనా ఫేస్‌బుక్ ద్వారా వేగంగా చేసుకోవచ్చు. మారుమూల గ్రామాల్లో సైతం ఫేస్‌బుక్ ఈజీగా యాక్సెస్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా అకౌంట్ల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అదే స్థాయిలో నష్టాలు కనిపిస్తున్నాయి. అవసరానికి మించి వాడటం, తప్పుడు మార్గాల్లో వినియోగం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎలా డిలీట్ చేయడం లేదా డీ యాక్టివేట్ చేయడం ఇక్కడ తెలుసుకుందామా..
- మొదటగా మొబైల్ లేక డెస్క్ టాప్ లో ఫేస్‌బుక్ లాగిన్ అవ్వాలి
- టాప్ రైట్ కార్నర్‌లో వరుసగా ఉన్న గీతలపై క్లిక్ చేయాలి.
- సెట్టింగ్స్ సింబల్ పై క్లిక్ చేయాలి.
- మెటా అకౌంట్ సెంటర్ అని కనపడుతుంది
- దానిలో మొదటి ఆప్షన్ పర్సనల్ డిటెయిల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- లాగింగ్ విత్ అకౌంట్స్ ఆప్షన్ కింద ఉన్న పర్సనల్ డిటెయిల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- పర్సనల్ డిటెయిల్స్‌లో కాంటాక్ట్ ఇన్‌ఫో, బర్త్ డే, ఐడెంటిటీ కన్ఫర్మేషన్, అకౌంట్ ఓనర్ షిప్ అండ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి.
- చివర్లో ఉన్న అకౌంట్ ఓనర్ షిప్ అండ్ కంట్రోల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- అందులో డీయాక్టివేషన్ OR డిలీట్ అనే ఆఫ్షన్ కనపడుతుంది.
- దానిపై క్లిక్ చేసినప్పుడు మన మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడిన ఫేస్‌బుక్ అకౌంట్ చూపిస్తుంది.
ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా ఫేస్‌బుక్‌తో కాన్ఫిగర్ చేసి ఉంటే ఇన్ స్టా అకౌంట్ కూడా మనకి కనిపిస్తుంది.
ఏదైతే అకౌంట్‌ను మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకు డీయాక్టివేట్, డిలీట్ అనే రెండు ఆఫ్షన్స్ కనిపిస్తాయి.
డీయాక్టివేట్ ఆప్షన్ ఎంచుకుంటే అకౌంట్ మత్రమే ఉంటుంది. దానిలో ఉన్న ఫొటోలు, ఇతర షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అవుతుంది. మళ్లీ మనకి అవసరం అయినప్పుడు తిరిగి యాక్టివేట్ చేసుకునే వీలుంటుంది. అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసినప్పటికీ మీరు మెసెంజర్‌ను మాత్రం వాడుకునే సౌలభ్యం ఉంటుంది.
డిలీట్ అకౌంట్ ఆఫ్షన్ ఎంచుకుంటే మన పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ పూర్తిగా తొలగించబడుతుంది. మళ్లీ మనం యాక్టివేట్ చేసుకునే వీలు కూడా ఉండదు. అవసరమైతే కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం మినహా వేరే ఆఫ్సన్ ఉండదు.
Also Read: బెస్ట్ గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి