Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
Netflix Subscription: ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ల్లో మనం చూసినా, చూడకపోయినా సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా కట్ అయిపోతూ ఉంటుంది. కానీ దాన్ని ఆపవచ్చు.
Netflix Hotstar Subscription: మీరు సినిమాలు, సిరీస్‌లు ఎక్కువగా చూసే వారు అయితే తప్పనిసరిగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసి ఉంటారు. కానీ కొన్నిసార్లు సమయం లేకపోవడం వల్ల మీరు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండకపోవచ్చు. కానీ వీటిలో ఉండే ఆటో డెబిట్ కారణంగా మనీ మాత్రం అకౌంట్ నుంచి కట్ అయిపోతూనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా అవుతుంది. మీ సబ్‌స్క్రిప్షన్ ఆటో రెన్యూ మోడ్‌లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది. కానీ ఇప్పుడు దీన్ని నియంత్రించడం చాలా సులభం. దీని కోసం మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను మాన్యువల్‌గా క్యాన్సిల్ చేయాలి. దీని ద్వారా మీరు ఖాతా నుంచి మనీ కట్ అవకుండా ఆపవచ్చు.
మీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ ఖాతాలో ఆటో పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అంతట మీరే పేమెంట్ చేస్తే తప్ప మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వదు.
ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఎలా ఆఫ్ చేయాలి?
ముందుగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు లాగిన్ అవ్వండి.
ఇక్కడ ప్రొఫైల్‌కి వెళ్లి సబ్‌స్క్రిప్షన్ లేదా అకౌంట్ ఆప్షన్‌ని ఎంచుకోండి.
ఆపై ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. తద్వారా మీ సభ్యత్వం మరోసారి రెన్యూ అవ్వదు. మనీ కట్ అవ్వదు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
మెంబర్‌షిప్‌ను ఎలా రద్దు చేయాలి?
ముందుగా మీ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. ఆపై మేనేజ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇక్కడ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ మీరు ముందే క్యాన్సిల్ చేసినా ఆ సబ్‌స్క్రిప్షన్‌ను దాని వ్యాలిడిటీ ముగిసే వరకు వాడుకోవచ్చు.
బ్యాంక్ అలెర్ట్స్‌ను సెటప్ చేయండి.
మీరు మీ బ్యాంక్ ఖాతాలో అలెర్ట్స్‌ను కూడా సెట్ చేయవచ్చు. మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎవరికీ షేర్ చేయకండి.
మీరు సబ్‌స్క్రిప్షన్ నుండి డెబిట్/క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్‌ను తీసివేయవచ్చు. ఇది అవసరం లేని సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను తీసేయడానికి మీకు సహాయం చేస్తుంది. దీని కారణంగా మీ అనుమతి లేకుండా డబ్బు తీయడం అస్సలు కుదరదు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Vikrant Massey and Deepak Dobriyal, in a killer cat and mouse chase to the dark and unsettling truth. Inspired by true events, Sector 36 comes to Netflix on 13 September. #Sector36OnNetflix pic.twitter.com/tXSo9BJmV1
— Netflix India (@NetflixIndia) September 5, 2024
Vardaan ka intezaar khatam! Ab chamatkaar dekho 🤩🤩#HotstarSpecials #TaazaKhabar Season 2 All episodes now streaming.#TaazaKhabarOnHotstar
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 26, 2024
Watch Now - https://t.co/OVkZQVIYhg pic.twitter.com/9XNkw3IH04