Hockey World Cup: 48 సంవత్సరాల ఎదురుచూపులు - ఈసారైనా ఫలిస్తాయా?
భారత జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిచి 48 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా కప్ సాధిస్తారా?
India vs Spain Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. దీని మొదటి మ్యాచ్ అర్జెంటీనా, దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఇందులో అర్జెంటీనా 1-0తో విజయం సాధించింది.
భారత్ తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఒడిశాలోని రూర్కెలాలో జరుగుతోంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి 48 ఏళ్లుగా కొనసాగుతున్న టైటిల్ కరువుకు తెర దించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా చివరిసారిగా 1975లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత టీమ్ ఇండియా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.
1971 ప్రపంచకప్‌లో భారత హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీని తర్వాత 1973లో, ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 1975లో పటిష్ట ఆటతీరును కొనసాగిస్తూనే టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది.
కానీ ఆ తర్వాత ప్రపంచకప్‌లో పెద్దగా విజయం నమోదు చేయలేకపోయింది. ప్రపంచకప్ కంటే ఆసియాకప్‌లో భారత్ మెరుగ్గా రాణిస్తోంది. భారత్ మూడుసార్లు ఆసియాకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2003, 2007, 2017లో గెలిచింది. ఈ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1982, 1985, 1989, 1994, 2013 సంవత్సరాల్లో జరిగిన టోర్నీలో ఫైనల్స్‌కు చేరుకుంది.
స్పెయిన్‌తో తొలి మ్యాచ్ తర్వాత, జనవరి 15వ తేదీన ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. అనంతరం జనవరి 19వ తేదీన వేల్స్‌తో జరిగే పోరు టీమ్ ఇండియా చివరి గ్రూప్ మ్యాచ్ కానుంది. భారత్, స్పెయిన్ గణాంకాలను పరిశీలిస్తే ఈ జట్టుపై టీమిండియాదే పైచేయి.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ విజయ శాతం 43.33గా ఉండటం విశేషం. కాగా, స్పెయిన్ 36.67 శాతం మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగిలిన 20 శాతం మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా, స్పెయిన్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి ఉంది.
🇮🇳 IND vs ESP 🇪🇸
— Hockey India (@TheHockeyIndia) January 13, 2023
The #MenInBlue 💙 will face the #RedSticks ❤️ in their first pool D match. Here's a look at the lineup!#HockeyIndia #IndiaKaGame #HWC2023 #StarsBecomeLegends @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI @rfe_hockey pic.twitter.com/UUMrIDoZQf
View this post on Instagram